Results : రేపు తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు

  • Written By:
  • Publish Date - April 29, 2024 / 12:02 PM IST

10th Class Exam Results: తెలంగాణ(Telangana)లో ఇటీవల నిర్వహించిన పదో తరగతి పరీక్ష ఫలితాలు(10th Class Exam Results) రేపు విడుదల కానున్నాయి. ఈ మేరకు పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను ఏప్రిల్‌ 13 నాటికే పూర్తి చేశారు. పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తికాగా.. తప్పులు దొర్లకుండా ఉండేందుకు మరోసారి జవాబు పత్రాలను పరిశీలించి.. మార్కుల నమోదుతో పాటు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు రాకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో టెన్త్‌ పరీక్ష ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లు చేశారు. పదో తరగతి పరీక్షలకు దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ఈ నెల 30న (మంగళవారం) ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://results.bsetelangana.org/ చూసుకోవచ్చు.

Read Also: Nikhil Siddhartha : జనసేన జెండా పట్టిన హీరో నిఖిల్.. వీడియో వైరల్..

మరోవైపు తెలంగాణ ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 24న విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించగా.. ఈసారి పరీక్షలకు దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో.. 4,78,527 మంది మొద‌టి సంవత్సరం విద్యార్థులు కాగా.. 4,43,993 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులున్నారు.