Site icon HashtagU Telugu

Teenmar Mallanna: ఆలేరు సభలో మల్లన్న సీఎం కేసీఆర్ పై కామెంట్స్

Teenmar Mallanna

Teenmar Mallanna

Teenmar Mallanna: ఆలేరు కాంగ్రెస్ మీటింగ్ లో పాల్గొన్న కాంగ్రెస్ నేత, జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అధికార పార్టీ బీఆర్ఎస్ పై సంచలన కామెంట్స్ చేశాడు. మల్లన్న మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, కొత్తగా రేషన్ కార్డ్ లు లేవని, తెలంగాణ డేంజర్ లో ఉందని సీఎం కేసీఆర్ ని విమర్శించారు. ఆలేరులో 10 సవత్సరాల నుండి ఎలాంటి అభివృద్ధి లేదు. వాసలమర్రి గ్రామంను దత్తత పేరుతో మోసం సీఎం కేసీఆర్ మోసం చెసిండని ఫైర్ అయ్యారు మల్లన్న. మెడిగడ్డ కుంగిపోయింది, బూడిదపై ప్రాజెక్టు కడతారా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగను అని చెప్పిన కెసిఆర్ ఈరోజు ఎన్నికల్లో ఓటు కోసం వస్తున్నాడు. పాత ట్యాంకులకు కలర్ వేసి బిల్లులు తీసుకుండ్రు. కాంగ్రెస్ రైతుల పక్షాన ఉంటుంది. కాళేశ్వరం కులుతుంది కానీ ప్రగతి భవన్ గట్టిగా కట్టుకుండని విమర్శించాడు.

కేసీఆర్ మధ్యం షాపులతో తెలంగాణను నడిపిస్తున్నడని ఆరోపించారు. కెసిఆర్ 500 గ్యాస్ అంటుండు మరి మొన్నటి వరకు ఎందుకు గుర్తు రాలేదని ప్రశ్నించాడు. కరెంట్ బిల్స్ బాదుడుతో పేదలు ఇబ్బంది పడుతున్నారని అన్నాడు. ఆలేరు ఓటర్లు గమనించాలి ఓటు చాలా విలువైనది. నా పుట్టిన నియోజకవర్గం ఆలేరు అని, బీర్ల అయిలయ్య ఎమ్మెల్యే అయితే నేను ఎమ్మెల్యే అయినట్లేని చెప్పాడు. ఆలేరులో కాంగ్రెస్ 30,000 మెజారిటీ తో గెలుస్తుందని మల్లన్న జోస్యం చెప్పాడు. కెసిఆర్ సభలో మాయమాయలు చెబుతున్నాడు. కెసిఆర్ సభకు వచ్చిన 60 % మంది కెసిఆర్ కి ఓటు వెయ్యారని చెప్పాడు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం అంటూ మండిపడ్డాడు.కెసిఆర్ ని గద్దెదించే సత్త కాంగ్రెస్ కి మాత్రమే ఉందని మల్లన్న అన్నాడు.

Also Read: Parliament Winter session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు రంగం సిద్ధం