Site icon HashtagU Telugu

Telangana CM: సీఎం సాబ్ తో తీన్మార్ మల్లన్న

Teenmar Mallanna

Teenmar Mallanna

Telangana CM: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతుంది. అందులో భాగంగా హస్తం పార్టీ గవర్నర్ తమిళిసైని కలిశారు. తెలంగాణలో మూడో శాసనసభ ఏర్పాటుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా సీఈవో వికాస్ రాజ్ విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేత నుంచి ఎవరూ సీఎం బాధ్యతలు తీసుకుంటారు అన్న దానిపై తీవ్ర కసరత్తు జరిగింది. ఉదయం హస్తం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరితో సీఎల్పీ సమావేశం నిర్వహించింది. ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా మాట్లాడిన డీకే శివకుమార్ వారి అభిప్రాయాలను అంగీకరించారు. అందరి అభిప్రాయాలు తీసుకుని అధికార యంత్రాంగానికి విన్నవించారు. మరోవైపు.. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను నాయకత్వానికి అప్పగిస్తూ.. ఏకగ్రీవ తీర్మానం కూడా చేశారు. దీంతో అధికార యంత్రాంగం సీఎం అభ్యర్థిని ఎప్పుడు ప్రకటిస్తుందనే ఆసక్తి నెలకొంది.

సీఎం అభ్యర్థి ప్రకటనపై కాంగ్రెస్ శ్రేణులతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉత్కంఠలో మునిగితేలుతున్న తరుణంలో తీన్మార్ మల్లన్న ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. మల్లన్న సీఎం సాబ్‌తో ఉన్న ఫొటోను ట్వీట్ చేశారు. అయితే.. ఆ ఫోటోలో ఉన్నది మరెవరో కాదు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. దీంతో అందరూ ఊహిస్తున్నట్టుగానే రేవంత్ రెడ్డి సీఎం కాబోతున్నారనే వాదనకు బలం చేకూరినట్లయింది.

రేవంత్ రెడ్డిని ఎన్నికల ముందు విమర్శించిన తీన్మార్ మల్లన్న అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రచార కమిటీలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఈరోజు సీఎం సాబ్‌తో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేయడంతో నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజుల తర్వాత బహుజన వాదం అంటూ.. ఇప్పుడు రేవంత్ రెడ్డి పంచన చేరిపోయాడంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.

Also Read: Health Benefits: చింతపండు రసం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?