Teaching Posts : మెడికల్ కాలేజీల్లో జాబ్స్.. నెలకు రూ.2 లక్షల దాకా శాలరీ

Teaching Posts :  తెలంగాణలో కొత్తగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రులు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

  • Written By:
  • Publish Date - October 8, 2023 / 12:53 PM IST

Teaching Posts :  తెలంగాణలో కొత్తగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రులు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో వాటి కోసం ఒప్పంద ప్రాతిపదిక టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేశారు. ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు తగిన అర్హతలను కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, కమ్యూనిటీ మెడిసిన్‌ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. వికారాబాద్, జనగామ, కరీంనగర్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, ఖమ్మం, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల మెడికల్ కళాశాలల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. దీనికి లాస్ట్ డేట్ అక్టోబరు 15. భర్తీ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాల కోసం  డైరెెక్టరేట్ ఆఫ్  మెడికల్ ఎడ్యుకేషన్ (https://dme. telangana. gov.in/) అధికారిక వెబ్ సైట్ ను చూడొచ్చు. అభ్యర్థులు తమ అప్లికేషన్ తో పాటు విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లను స్కాన్‌ చేసి ‘‘dme recruitment .contract@gmail.com’’కు ఈమెయిల్‌  ద్వారా పంపొచ్చు. ఈ పోస్టులకు ఎంపికయ్యే వారిని కాంట్రాక్టు విధానంలో కేవలం ఒక ఏడాది కోసం విధుల్లోకి తీసుకోనున్నారు. ఏడాది తర్వాత అవసరాన్ని బట్టి పదవీ కాలాన్నిపొడిగింపుపై నిర్ణయాన్ని తీసుకుంటారు.

We’re now on WhatsApp. Click to Join

అర్హతలు, వేతనాలు.. 

  • ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే.. సంబంధిత విభాగంలో ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ కోర్సుల్లో పాస్ అయి ఉండాలి.  బోధన, రీసెర్చ్ అనుభవం కూడా కలిగి ఉండాలి.
  • వయోపరిమితి 69 సంవత్సరాలకు మించరాదు.
  • పీజీ మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్ధులను పోస్టులకు ఎంపిక చేస్తారు.
  • ప్రొఫెసర్‌ పోస్టులకు నెలకు రూ.1.90 లక్షలు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు నెలకు రూ.1.50 లక్షలు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు నెలకు రూ.1.25 లక్షలను చెల్లిస్తారు.
  • అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాలకు అదనంగా మరో రూ.50,000 (Teaching Posts)  అందజేస్తారు.

Also read : AP : రోజా అనే మాటలు వీరికి తెలియవా..? అందుకే సపోర్ట్ చేస్తున్నారా..?