Site icon HashtagU Telugu

TCL Electronics: తెలంగాణాలో టిసిఎల్ ఎలక్ట్రానిక్స్ రూ.225 కోట్ల పెట్టుబడులు

TCL Electronics

New Web Story Copy 2023 06 28t152243.241

TCL Electronics: టిసిఎల్ ఎలక్ట్రానిక్స్ తెలంగాణాలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చింది. రాష్ట్రంలో కొత్త ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలలో ఒకటైన టిసిఎల్ ఎలక్ట్రానిక్స్ రూ. 225 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ఈ పెట్టుబడి ద్వారా తొలుత 500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.

టిసిఎల్ ఎలక్ట్రానిక్స్ కొత్త ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ వాషింగ్ మెషీన్‌లను ఉత్పత్తి చేయడంలో ప్రత్యేకతను చాటుకుంది. భవిష్యత్తులో రిఫ్రిజిరేటర్‌లను విస్తరించేందుకు సిద్ధంగా ఉంది. ఇక ఆ సంస్థ తెలంగాణాలో పెట్టుబడులకు ముందుకు రావడం సంతోషంగా ఉందని చెప్పారు మంత్రి కేటీఆర్. టీసీఎల్‌తో జాయింట్ వెంచర్ చేస్తున్న రెసోజెట్‌కు అభినందనలు అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Read More: Tamilisai Vs Harish Rao: ఉస్మానియా ఆస్పత్రిపై తమిళిసై ట్వీట్, హరీశ్ రావు కౌంటర్!