Tarbandi Scheme : రైతులకు గుడ్ న్యూస్..మీ పంట పొలాన్ని కాపాడేందుకు సరికొత్త పథకం

రెండు లక్షల రుణమాఫీ చేసి..దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని పని చేసి శభాష్ అనిపించుకుంది. రైతుల కోసం ఆలోచించేది ఒక్క కాంగ్రెస్ పార్టీనే అని చెప్పకనే చెప్పారు

Published By: HashtagU Telugu Desk
Tarbandi Scheme In Telangan

Tarbandi Scheme In Telangan

తెలంగాణ లో అధికారం చేపట్టిన రేవంత్ సర్కార్ (Revanth Govt) రైతులకు వరుస గుడ్ న్యూస్ లు అందజేస్తూ వస్తుంది. తాజాగా రెండు లక్షల రుణమాఫీ చేసి..దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని పని చేసి శభాష్ అనిపించుకుంది. రైతుల కోసం ఆలోచించేది ఒక్క కాంగ్రెస్ పార్టీనే అని చెప్పకనే చెప్పారు. ఇక ఇప్పుడు మరో గుడ్ న్యూస్ అందజేశారు రేవంత్. రైతుల కోసం తారాబంది పధకాన్ని తీసుకరాబోతున్నారు. ఇటీవల కాలంలో రైతులకు వేసిన పంటను కాపాడుకోవడం ఎంత కష్టంగా మారిందో తెలియంది కాదు. కోతుల బెడద , పశువుల బెడద కారణంగా చేతికి వచ్చిన పంట నాశనం అవుతుంది. రైతులు ఈ సమయంలో పంటను కాపాడుకోవడానికి కంచెను వేస్తుంటారు. అయితే, ప్రభుత్వం రైతుల కోసం కొత్త పథకాన్ని ముందుకు తీసుకొచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

తారాబంది పథకం (Tarbandi Scheme) ద్వారా.. రైతులు తమ పొలాలు చుట్టూ ఫెన్సింగ్‌ను ఏర్పాటు కోసం గ్రాంట్స్ ను పొందవచ్చు. ఈ పథకం ద్వారా ఫెన్సింగ్ సొంతగా వేసుకోవడానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో దానిలో 90 శాతం వరకు సబ్సిడీ వస్తుంది. ఒక వేళ, రైతులకు ఫెన్సింగ్ ఖర్చు రూ.20,000 అయితే.. రూ.18 వేలు తిరిగి వస్తుంది. అప్పుడు రైతులు రూ.2 వేలు మాత్రమే చెల్లిస్తే చాలు. దీనికి కావాల్సిన పత్రాలు.. బ్యాంక్ పాస్ బుక్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, ఆధార్ కార్డు, ఫెన్సింగ్ వైర్ కోసం చెల్లించిన డబ్బు రిసిప్ట్ తో మీరు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యవసాయం చేసే ఏ రైతు అయినా ఈ పథకానికి అర్హులు.

Read Also : Shikhar Dhawan: లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో ధావన్ మళ్ళీ బ్యాట్ పట్టనున్న గబ్బర్

  Last Updated: 26 Aug 2024, 04:24 PM IST