Tamil Nadu Party : తెలంగాణ ఎన్నికల బరిలో తమిళనాడు రాజకీయ పార్టీ

వీసీకే పార్టీ తమిళనాడులో బహుజనులు, దళితుల హక్కుల కోసం గత నాలుగు దశాబ్దాలుగా పోరాడుతోంది.

  • Written By:
  • Updated On - April 28, 2024 / 10:49 AM IST

Tamil Nadu Party : తొలిసారిగా ఓ తమిళపార్టీ తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీచేస్తోంది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానాలపై ఆ పార్టీ ఫోకస్ పెట్టింది.ఇంతకీ ఆ పార్టీ ఏది .. అనుకుంటున్నారా ?  విడుతలై చిరుతైగల్‌ కట్చి (వీసీకే) పార్టీ !! ఈ పార్టీ హైదరాబాద్‌ లోక్‌సభ అభ్యర్థిగా జె.పద్మజకు టికెట్ ఇచ్చింది. ఈమె ముషీరాబాద్‌ వాస్తవ్యురాలు. ఇక సికింద్రాబాద్‌ లోక్‌సభకు చెందిన వీసీకే పార్టీ టికెట్‌ను పగిడిపల్లి శ్యామ్‌‌కు దక్కించుకున్నారు. ఈయన కుత్బుల్లాపూర్‌లోని సూరారం కాలనీ వాస్తవ్యుడు.

We’re now on WhatsApp. Click to Join

వీసీకే పార్టీ తమిళనాడులో బహుజనులు, దళితుల హక్కుల కోసం గత నాలుగు దశాబ్దాలుగా పోరాడుతోంది. ఈ పార్టీ పాత పేరు ‘దళిత్‌ పాంథర్స్‌ ఇండియా’. ఈ పార్టీ అధ్యక్షుడిగా తిరుమావలన్‌ కొనసాగుతున్నారు. తమిళనాడులో డీఎంకే పార్టీకి మిత్రపక్షంగా వీసీకే కొనసాగుతోంది. ఈసారి పొత్తులో భాగంగా వీసీకే పార్టీకి రెండు లోక్‌సభ స్థానాలను కేటాయించారు. మొత్తం మీద తెలంగాణకు ఆయువుపట్టుగా నిలిచే హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాల్లో  తమిళనాడుకు చెందిన రాజకీయ పార్టీ వీసీకే పోటీ చేస్తుండటం  గమనార్హం.

Also Read : Central Armed Forces : కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో 506 జాబ్స్

వీసీకే పార్టీ సూత్రాలివీ..  

తమిళ ప్రజల మధ్య విభేదాలను తొలగించడం.. సామాజికంగా, ఆర్థికంగా బలహీనపడిన వర్గాలను పైకి లేపడమే వీసీకే పార్టీ ప్రధాన లక్ష్యం. శ్రీలంకలో జరిగిన తమిళ ఈలం స్వాతంత్య్ర ఉద్యమానికి వీసీకే పార్టీ మద్దతు పలికింది. విదేశాలలో నివసిస్తున్న తమిళ ప్రజల భద్రతపై ఈ  పార్టీ రాజీలేని పోరాటం చేసింది. మిలిటెంట్ సంస్థ ఎల్టీటీఈకి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో వేలాది మంది అమాయక తమిళ ప్రజలను హతమార్చినందుకు అప్పటి శ్రీలంక పాలకుడు మహీందా రాజపక్సపై యుద్ధ నేరాల అభియోగాన్ని మోపాలని  వీసీకే పార్టీ డిమాండ్ చేసింది. 

Also Read : Fitness : తిన్న తర్వాత మీకు నిద్ర వస్తోందా? అయితే.. ఇలా ప్రయత్నించండి..!