తెలంగాణలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే అధికార కాంగ్రెస్ పార్టీలోనూ అంతర్గత విభేదాలు బయట పడడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ అవుతుంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ( Teenmaar Mallanna) తన ఆరోపణలతో పార్టీ నాయకత్వాన్ని అప్రతిష్ట పాల్జేయడమే కాకుండా, పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఆయనపై కాంగ్రెస్ పార్టీ నుంచి క్రమశిక్షణా చర్యలు చేపట్టారు.
Shamshabad Airport : ఎయిర్ పోర్ట్ లో చిక్కుకుపోయిన విజయ్ దేవరకొండ
ఈ విషయంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) స్పందిస్తూ.. తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడటానికి తనకు సమయం లేదని, ఈ అంశంపై చర్చించడమే అనవసరమని స్పష్టం చేశారు. భువనగిరిలో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తీన్మార్ మల్లన్నపై పార్టీ ఇప్పటికే నోటీసులు జారీ చేసిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కులగణన సర్వే ప్రకారం.. రాష్ట్రంలో 56.6 శాతం బీసీలు ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలను అన్ని రంగాల్లో ప్రోత్సహించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలోనూ వెనుకడుగు వేయబోమని స్పష్టం చేశారు.