Talasani Srinivas Yadav : తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట తీవ్ర విషాదం

గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శంకర్ యాదవ్.. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మరణించారు

Published By: HashtagU Telugu Desk
Talasani Brother

Talasani Brother

బీఆర్ఎస్ ఎమ్మెల్యే , మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన సోదురుడు తలసాని శంకర్ యాదవ్ (Shankar Yadav) తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శంకర్ యాదవ్.. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మరణించారు. మోండా మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న శంకర్ యాదవ్.. గతంలో బోయిన్‌పల్లి మార్కెట్ అధ్యక్షుడిగా పని చేశారు. శంకర్ యాదవ్ మరణ వార్త తెలిసి పార్టీ నేతలు, కార్యకర్తలు, బంధు, మిత్రులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ బీఆర్‌ఎస్‌ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. సనత్‌ నగర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. గతంలో బిఆర్ఎస్​ పార్టీలో రెండు సార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. 2014లో కేసీఆర్ తొలి మంత్రివర్గంలో పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల బాధ్యతలు నిర్వర్తించాడు. రెండవ మంత్రివర్గంలో కూడా మంత్రిగా చేశాడు. శంకర్ యాదవ్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సైతం సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కష్టకాలంలో భగవంతుడు వారికి ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు.

Read Also : Mobile Sound Problem: మీ మొబైల్ ఫోన్ లో సౌండ్ సరిగ్గా వినిపించడం లేదా.. అయితే వెంటనే ఇలా చేయండి?

  Last Updated: 10 Jun 2024, 11:33 AM IST