T leaders in delhi : ఢిల్లీలో తెలంగాణ రాజ‌కీయ వేడి

తెలంగాణ రాజ‌కీయం ఢిల్లీకి (T leaders in delhi)మారింది. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలు హ‌స్తిన కేంద్రంగా పావులు క‌దుపుతున్నాయి.

  • Written By:
  • Publish Date - June 24, 2023 / 04:44 PM IST

తెలంగాణ రాజ‌కీయం ఢిల్లీకి (T leaders in delhi)మారింది. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలు హ‌స్తిన కేంద్రంగా పావులు క‌దుపుతున్నాయి. హుటాహుటిన కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల పిలుపు మేర‌కు వెళ్లిన ఆయ‌న రాష్ట్రంలోని రాజ‌కీయ మార్పుల మీద చ‌ర్చించ‌నున్నారు. మ‌రో వైపు ఈటెల రాజేంద్ర‌, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. భారీ మార్పులు బీజేపీలో ఉంటాయ‌ని తెలుస్తోంది.

తెలంగాణ రాజ‌కీయం ఢిల్లీకి (T leaders in delhi)

మునుగోడు ఉప ఎన్నిక‌ల వ‌ర‌కు బీజేపీ గ్రాఫ్ తెలంగాణ‌లో బాగుంది. బీఆర్ఎస్ పార్టీకి ప్ర‌త్యామ్నాయం బీజేపీ అనే స్థాయికి వెళ్లింది. అక్క‌డ ఓడిపోయిన‌ప్ప‌టికీ రెండో ప్లేస్ లో నిల‌వ‌డంతో కాంగ్రెస్ పార్టీ మూడో ప్లేస్ కు ప‌డిపోయింది. కానీ, ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ విష‌యంలో బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు వ్య‌వ‌హ‌రించిన తీరు బీజేపీని దెబ్బ తీసింది. ఇదే విష‌యాన్ని అధిష్టానంకు తెలియ‌చేస్తామ‌ని కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మీడియాకు చెప్పారు. పార్టీ మార్పు గురించి దాట‌వేస్తూ ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవాలి? అనేది త‌మ‌కు వ‌దిలేయాల‌ని అన్నారు. అంతేకాదు, ప్ర‌జాభీష్టం, తెలంగాణ ఆకాంక్ష‌ల కోసం న‌డుచుకుంటామ‌ని చెప్ప‌డం పార్టీ మార్పుకు అవ‌కాశం ఉంద‌ని ప‌రోక్షంగా సంకేతాలు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

Also Read : KTR: కేటీఆర్ ఢిల్లీ పర్యటన.. అమిత్ షాతో భేటీ!

తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మాత్రం మునిగిపోయే ప‌డ‌వ‌లాంటి కాంగ్రెస్ లోకి వెళ‌తామంటే ఎవ‌ర్నీ ఆపేదిలేద‌ని తేల్చేశారు. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. సీనియ‌ర్ల‌లోని అసంతృప్తిని పెద్ద‌గా ఆయ‌న ప‌ట్టించుకోలేదు. కానీ, అధిష్టానం మాత్రం సీనియ‌ర్ల‌లోని అస‌హ‌నాన్ని గ‌మ‌నించింది. వాళ్ల‌ను బుజ్జ‌గించే ప‌నిలో ఉంది. పార్టీ ప్ర‌క్షాళ‌న చేయ‌క‌పోతే రాబోవు రోజుల్లో దెబ్బ‌తింటామ‌న్న భావ‌న అధిష్టానంలోనూ ఉంది. అందుకే, ఈటెల‌, కోమ‌రెడ్డి, కిష‌న్ రెడ్డిల‌ను అక‌స్మాత్తుగా పిలుపించుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తెను ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో అరెస్ట్ చేయ‌క‌పోవ‌డంతో బీజేపీ గ్రాఫ్ ప‌డిపోయింద‌ని నేత‌లు ముక్త‌కంఠంతో చెబుతున్నారు. కాంగ్రెస్ చెబుతోన్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక‌టే అనే సంకేతం. ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్లింద‌ని అధిష్టానం  (T leaders in delhi) వ‌ద్ద మొర‌పెట్టుకుంటున్నారు.

రెండు రోజుల్లో ష‌ర్మిల కూడా రాహుల్‌, ప్రియాంక‌ల‌ను క‌లుసుకునే ఛాన్స్

బీజేపీ తెలంగాణ నేత‌లు ఢిల్లీ వేదిక‌గా పెద్ద‌ల‌తో మంత‌నాలు సాగిస్తున్న స‌మ‌యంలోనే మంత్రి కేటీఆర్ కూడా హ‌స్తిన ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఆయ‌న మూడు రోజుల పాటు కేంద్రంలోని మంత్రుల‌ను క‌ల‌వాల‌ని ప్లాన్ చేసుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను క‌లుసుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఒక వైపు క‌విత‌ను అరెస్ట్ చేయాల‌ని రాష్ట్ర బీజేపీ నేత‌లు ఒత్తిడి తీసుకొస్తున్న స‌మ‌యంలో మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రుల‌తో లైజ‌నింగ్ కు వెళ్ల‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్ మీద ఉంది. ఆ పార్టీలోకి రావ‌డానికి బీజేపీలోని సీనియ‌ర్లు క్యూ క‌డుతున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వాన్ని వ్య‌తిరేకిస్తూనే కాంగ్రెస్ అధిష్టానం తమ అభిప్రాయాల‌ను చెబుతున్నారు. రెండు రోజుల్లో ష‌ర్మిల కూడా రాహుల్‌, ప్రియాంక‌ల‌ను క‌లుసుకునే(T leaders in delhi) ఛాన్స్ ఉంది.

ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ రాజ‌కీయం మ‌లుపులు

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి, మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు 26న ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో భేటీ కానున్నారు. కొన్ని డిమాండ్ల‌ను పెట్ట‌డం ద్వారా పార్టీలో చేర‌డానికి మార్గాన్ని సుగ‌మ‌మం చేసుకుంటున్నారు. ప్ర‌త్యేకించి ష‌ర్మిల మూడు డిమాండ్లు పెట్టిన‌ట్టు తెలుస్తోంది. తెలంగాణ పీసీసీలో కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం, క‌నీసం ఐదు మంది ఎమ్మెల్యేలుగా త‌న అనుచరులు పోటీ పెట్ట‌డానికి అవ‌కాశం, ఏపీకి అడుగు పెట్ట‌కుండా తెలంగాణ వ‌ర‌కు రాజ‌కీయాల‌ను చేయ‌డం. ఇలాంటి కండీష‌న్ల‌ను పెట్టారు. ఇప్ప‌టికే డీకే శివ‌కుమార్ వ‌ద్ద ఈ డిమాండ్ల‌ను ఉంచ‌గా, అధిష్టానంతో ఆయ‌న సంప్ర‌దింపులు జ‌రిపారు. క్లియ‌రెన్స్ రావ‌డంతో రెండు రోజుల్లో ఆమె కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ అయ్యే అవ‌కాశం ఉంది.

Also Read : Delhi Deals : తెలంగాణ‌లో డ్ర‌గ్స్ కేసు, ఢిల్లీలో మంత్రి కేటీఆర్!

బీజేపీ, కాంగ్రెస్ కు చెందిన లీడ‌ర్లు ఢిల్లీ వేదిక‌గా అధిష్టానంతో సంప్ర‌దింపుల (T leaders in delhi) బిజీలో ఉన్నారు. పార్టీ నుంచి వెళ్లే వాళ్ల‌ను కాపాడుకునే ప‌నిలో బీజేపీ ఉండ‌గా, పార్టీలోకి వ‌చ్చే వాళ్ల కండీష‌న్ల‌ను అంగీక‌రించ‌డంపై కాంగ్రెస్ ఢిల్లీ పెద్ద‌లు బిజీగా ఉన్నారు. బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రుల‌ను క‌ల‌వ‌డానికి మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. సీఎం కేసీఆర్ ఉండ‌గా, మంత్రి హోదాలో కేటీఆర్ ఢిల్లీ వెళ్ల‌డం కుటుంబ పాల‌న‌కు నిద‌ర్శ‌నంగా ఉంద‌ని విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటున్నారు. మొత్తం మీద ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ రాజ‌కీయం మ‌లుపులు తిరిగేలా క‌నిపిస్తోంది.

Also Read : BJP-YCP : చ‌క్ర‌బంధంలో చంద్ర‌బాబు, ప‌వ‌న్