Site icon HashtagU Telugu

TS : KTR ‘జాతక రామారావు’ అయ్యాడంటూ కాంగ్రెస్ సైటైర్

Ktr Tcg

Ktr Tcg

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ – బిఆర్ఎస్ (Congress – BRS) మధ్య ఎలాంటి మాటల యుద్ధం కొనసాగిందో..ఇప్పుడు లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections ) సమయం దగ్గర పడుతుండడం తో ఇరు నేతల మధ్య వార్ నడుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్ ఎలాగైనా..లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తుంది. ఈ క్రమంలో గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తూ వస్తున్న అధినేత కేసీఆర్. ఇటు అసెంబ్లీ ఎన్నికల సక్సెస్ తో ఫుల్ స్వింగ్ లో ఉన్న కాంగ్రెస్..లోక్ సభ ఎన్నికల్లో కూడా భారీ విజయం సాదించబోతుందని ధీమా వ్యక్తం చేస్తుంది. ఈరోజు కానీ రేపు కానీ మొదటి విడత అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించబోతుంది.

ఈ తరుణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పై టీ -కాంగ్రెస్ ట్విట్టర్ (T Congress Twitter) వేదికగా సెటైర్లు వేసింది. ‘రాజకీయ నిరుద్యోగిగా మారడంతో జాతకాలు చెప్పే డ్యూటీలో చిన్న దొర ఎక్కినట్లున్నాడు. పెద్ద దొర ఐదారు నెలల తర్వాత సర్కారు ఉండదు అంటాడు. ఇగ ఈయనేమో కాంగ్రెస్‌ను బొంద పెడతామంటాడు. ఎంత మీకు బీజేపీతో స్నేహం ఉంటే మాత్రం అంత పబ్లిక్ గా ఇలా ఎలా మాట్లాడతారు. మాకేం బీజేపీ ఉంది. ప్రభుత్వాలు కూల్చడంల, పార్టీలు చీల్చడంల వాళ్లు దిట్ట. ఇక్కడ ఆ పనే చేస్తారు. మల్లా అయ్యా కొడుకులు దోపిడీకి సిద్ధమవుదామని అనుకుంటున్నారా? కేటీఆర్ మీ దొంగ కలలు నేరవేరవు అంటూ ఫైర్ అయింది.

We’re now on WhatsApp. Click to Join.

గత ఎన్నికల్లో మీరు, మీ బీజేపి కలిసి వ్యవస్థలన్నింటిని మేనేజ్ చేసి సంఘటితంగా మమ్మల్ని నామరూపాలు లేకుండా చెయ్యాలని చూస్తే, ప్రజలు మీకు గట్టిగా బుద్ధి చెప్పారు. ప్రజాస్వామ్యంలో నాయకుడు పని చెయ్యాలే. కాని మాటలతో పబ్బం గడిపి అప్పుడు తెలంగాణను ఆగం చేసిండ్రు, ఇప్పుడు అధికారం పోయాక ఇలా సోది చెప్తూ ఇప్పుడు ఇలా ఆగం చెయ్యాలని చూస్తుండ్రు. అందుకే ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టిండ్రు, కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఈ సోది ముచ్చట్లు ఆపితే ఆ కాస్తైనా గౌరవం నిలుపుకున్న వాళ్ళు అవుతారు. లేదంటే మా నేత చెప్పనే చెప్పిండు, ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అన్న లాగుల్లా ఏం ఇడుస్తమన్నరో మీకు యాదికి ఉందనే నమ్ముతున్నాం. జర భద్రం…!!’ అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ కు జాతకం తారుమారయ్యాకా మొత్తానికి జాతకాలు చెప్పుకు బతుకుతున్నావన్న మాట.. ఎలాగూ సోది చెప్పడం అలవాటే కదా.. కానీ..!! అని రాసి ఉన్న జాతక రామారావు ఫోటోను ట్యాగ్ చేసింది.

Read Also : Credit Card Users : ఇక మీకు నచ్చిన నెట్‌వర్క్‌లో క్రెడిట్‌ కార్డు.. ఎలా ?

 

Exit mobile version