T Congress :రేవంత్ మార్క్ ,ప్రేమ్ సాగ‌ర్ రావుకు ఎస‌రు

తెలంగాణ కాంగ్రెస్ (T Congress) అంత‌ర్గ‌త కుమ్ములాట‌లకు ఎండింగ్ లేదు.అంతా బాగుందని

  • Written By:
  • Updated On - April 22, 2023 / 03:36 PM IST

తెలంగాణ కాంగ్రెస్ (T Congress) అంత‌ర్గ‌త కుమ్ములాట‌లకు ఎండింగ్ లేదు. అంతా బాగుందని భావిస్తోన్న స‌మ‌యంలో ఏదో ఒక ఇష్యూ వ‌చ్చి ప‌డుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy)  వ‌ర్సెస్ పాత కాంగ్రెస్ వివాదం నివురుగ‌ప్పిన నిప్పులా ఉంది. ప్ర‌తిచోటా ఆ గ్యాప్ క‌నిపిస్తోంది. తాజాగా మంచిర్యాల స‌భ‌లోనూ వ‌ర్గ‌పోరు స్ప‌ష్టంగా క‌నిపించింది. బాహాటంగా రేవంత్ రెడ్డిని వ్య‌తిరేకించే ప్రేమ్ సాగ‌ర్ రావు హ‌వా ప్ర‌స్తుతం ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా న‌డుస్తోంది. దానికి చెక్ పెట్టడ్డానికి రేవంత్ రెడ్డి స‌మామాత్తం అయ్యార‌ని తెలుస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్  అంత‌ర్గ‌త కుమ్ములాట‌లకు(T Congress)

తెలంగాణ(T Congress) వ్యాప్తంగా రేవంత్ రెడ్డి (Revanth Reddy)గ్రూప్ చాప‌కింద నీరులా ప‌నిచేస్తోంది. ప్ర‌తి జిల్లాలోనూ ఆయ‌న గ్రూప్ కు చెందిన వాళ్ల‌దే పైచేయిగా ఉండేలా ప్లాన్ చేసుకున్నార‌ని అంత‌ర్గ‌తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఆ క్ర‌మంలో ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలోని మాజీ మంత్రి గడ్డం వినోద్, టీపీసీసీ సెక్రెటరీ గోమాస శ్రీనివాస్, సీనియర్ లీడర్ కేవీ ప్రతాప్, ఐఎన్టీయూసీ జనరల్ సెక్రెటరీ జనక్​ప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు అమురాజుల శ్రీదేవి, బోడ జనార్దన్, నాయకుల కారుకూరి రామచందర్, ముత్తె సత్తయ్య, మత్తమారి సూరిబాబు తదితరులు రేవంత్ రెడ్డికి ప్ర‌ధాన గ్రూప్ గా ఫోక‌స్ అవుతున్నారు. వాళ్లంద‌రూ ప్రేమ్​సాగర్​రావును వ్యతిరేకిస్తూ రేవంత్ రెడ్డి వ‌ద్ద రాజ‌కీయ షెల్డ‌ర్ తీసుకున్నారు. అయిన‌ప్ప‌టికీ వాళ్ల‌ను మంచిర్యాల స‌భ‌కు ప్రేమ్ సాగ‌ర‌రావు దూరంగా ఉంచారు. అంతేకాదు, రేవంత్ రెడ్డితో స‌హా ఆయ‌న అనుచరుల‌ను వేదిక వ‌ద్ద‌కు రాకుండా చేయ‌గ‌లిగారు. ఒన్ మేన్ షో ను ప్రేమ్ సాగ‌ర్ రావు న‌డిపారు.

ఆదిలాబాద్ జిల్లాలో  ప్రేమ సాగ‌ర్ రావు తిరుగులేకుండా

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో కీల‌క లీడ‌ర్ గా ఉన్న ప్రేమ సాగ‌ర్ రావు ఇప్పుడు తిరుగులేకుండా ఉంది. గ‌తంలో ఏలేటి మ‌హేశ్వ‌ర‌రెడ్డి, ప్రేమ్ సాగ‌ర‌రావు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గ‌మ‌నేలా గ్రూపులు ఉండేవి. తాజాగా మ‌హేశ్వ‌ర‌రెడ్డి బీజేపీ కండువా క‌ప్పుకున్నారు. దీంతో ఏక‌ఛ‌త్రాధిప‌త్యంగా ప్రేమ్ సాగ‌ర్ రావు రాజ‌కీయ న‌డుస్తోంది. అందుకు (T Congress)కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్ష నేత భ‌ట్టీ విక్ర‌మార్క్ మ‌ద్ధ‌తు సంపూర్ణంగా ఉంది. అందుకే, వ్యూహాత్మంగా కాబోయే సీఎం భ‌ట్టీ విక్ర‌మార్క్ అనే సంకేతాల‌ను మంచిర్యాల వేదిక‌గా బ‌లంగా ఇచ్చారు. స‌భ‌ల్లో ఎక్క‌డికి వెళ్లినా సీఎం..సీఎం అంటూ రేవంత్ రెడ్డికి నినాదాలు వినిపించేవి. కానీ, మంచిర్యాల స‌భ‌లో ఆయ‌న‌కు అలాంటి నినాదాలు లేకుండా ప్రేమ్ సాగ‌ర్ రావు గ‌లిగారు. అంతేకాదు, భ‌ట్టీ విక్ర‌మార్క్ కు అనుకూలంగా సీఎం నినాదాల‌ను చేయించారు. సీనియ‌ర్లు కూడా ప‌రోక్షంగా భ‌ట్టీకి మ‌ద్ధ‌తు ప‌లికారు. ఇదంతా గ‌మ‌నించిన రేవంత్ రెడ్డి(Revanth Reddy) వ‌ర్గీయులు ఘోర అవ‌మానంగా ఫీల్ అయ్యారు.

బీఆర్ఎస్ లీడ‌ర్ శ్రీహ‌రిరావును కాంగ్రెస్ వైపు

మంచిర్యాల స‌భ త‌రువాత పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ముభావంగా ఉన్నార‌ట‌. దాని వెనుక ఏదో రాజ‌కీయ ఎత్తుగ‌డ ఉంద‌ని ఆయ‌న గురించి తెలిసిన వాళ్లు భావిస్తున్నారు. అవ‌మానానికి కార‌ణ‌మైన ప్రేమ్ సాగ‌ర్ రావు రాజ‌కీయ పునాదుల‌ను క‌దిలించే ప్లాన్ చేస్తున్నార‌ని టాక్‌. అందుకే, నిర్మ‌ల్ కు చెందిన బీఆర్ఎస్ లీడ‌ర్ శ్రీహ‌రిరావును కాంగ్రెస్ వైపు మ‌ళ్లాంచార‌ట‌. ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో చేరి కీ రోల్ పోషిస్తే, ప్రేమ్ సాగ‌ర్ రావుకు ఎర్త్ పెట్టిన‌ట్టు అవుతోంద‌ని రేవంత్ వ‌ర్గీయులు అంచ‌నా వేస్తున్నారు. అందుకే శ్రీహ‌రిరావు ద్వారా ఆదిలాబాద్ జిల్లాను అనుకూలంగా మ‌లుచుకోవాల‌ని చూస్తున్నార‌ని తెలుస్తోంది.

Also Read : T Congress: మంచిర్యాలలో`సీఎం`చిచ్చు,రాజేసిన కోమ‌టిరెడ్డి

ఇత‌ర పార్టీల లీడ‌ర్ల‌ను కాంగ్రెస్ పార్టీలోకి (T Congress) తీసుకునే విష‌యంలో రేవంత్ రెడ్డి, సీనియ‌ర్ల మ‌ధ్య పొస‌గ‌డంలేదు. సీనియ‌ర్ల‌కు ఇష్టంలేకుండా కొంద‌ర్ని నేరుగా రేవంత్ రెడ్డి పార్టీలోకి తీసుకున్నారు. ఇలాంటి ప‌రిణామాన్ని నిలువ‌రించ‌డానికి ప్ర‌త్యేక క‌మిటీని అధిష్టానం వేసింది. ఆ క‌మిటీలో సీనియ‌ర్లు ఎక్కువ‌గా ఉన్నారు. దీంతో రేవంత్ రెడ్డి తీసుకోవాలి అనుకునే లీడర్ల‌కు బ్రేక్ ప‌డుతోంది. పాత కాంగ్రెస్ లీడ‌ర్ల‌ను రాజ‌కీయంగా తొక్కేయ‌డానికి రేవంత్ రెడ్డి తెలుగుదేశంలోని లీడ‌ర్ల‌ను తీసుకొస్తున్నార‌ని తొలి నుంచి వినిపించే మాట‌. ఆ క్ర‌మంలో ఇప్పుడు శ్రీహ‌రి రావును కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవ‌డం రేవంత్ రెడ్డికి (Revanth Reddy) అంత ఈజీ కాదు. పైగా ఏలేటి మ‌హేశ్వ‌ర‌ర‌రెడ్డి బీజేపీలోకి వెళ్లిన త‌రువాత ప్రేమ్ సాగ‌ర్ రావు బ‌ల‌ప‌డ్డారు. పైగా మంచిర్యాల స‌భ విజ‌య‌వంతం అయింది. భ‌ట్టీ వ‌ర్గంగా ఆయ‌న ఉన్నారు. ఇలాంటి అడ్డంకుల‌ను అధిగ‌మించి ప్రేమ్ సాగ‌ర్ రావుకు ధీటైన శ్రీహ‌రి రావును కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురాగ‌ల‌రా? అనేది చూడాలి.

Also Read : T Congress : `విక్ర‌మార్క్`కాంగ్రెస్ మార్చ్! AICC ఆశీస్సులు!!