T-Congress: ఢిల్లీ కేంద్రంగా `టీ-కాంగ్రెస్` బ్లేమ్ గేమ్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో బ్లేమ్ గేమ్ న‌డుస్తోంది. ఢిల్లీ కేంద్రంగా అత్య‌వ‌స‌ర సమావేశమైన సీనియ‌ర్లు ఎటూతేల్చుకుండా రాజ‌గోపాల్ రెడ్డి అంశాన్ని కోల్డ్ స్టోరీజిలోకి నెట్టారు.

  • Written By:
  • Updated On - August 2, 2022 / 03:24 PM IST

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో బ్లేమ్ గేమ్ న‌డుస్తోంది. ఢిల్లీ కేంద్రంగా అత్య‌వ‌స‌ర సమావేశమైన సీనియ‌ర్లు ఎటూతేల్చుకోలేక రాజ‌గోపాల్ రెడ్డి అంశాన్ని కోల్డ్ స్టోరీజిలోకి నెట్టారు. ఆయ‌న్ను స‌స్సెండ్ చేయ‌డానికి అత్య‌వ‌స‌ర స‌మావేశమై బ్లేమ్ గేమ్ ఆడారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద మొత్తం భరాని పెట్టేశారు. ఆయ‌న ఏదో ఒక నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఏఐసీసీ ఎదుట ఉంచారు.

సీనియ‌ర్ల బ్లేమ్ గేమ్ ను గుర్తించిన రేవంత్ రెడ్డి చాక‌చ‌క్యంగా ఉత్త‌మ్, జానారెడ్డి, భ‌ట్టి మీద మొత్తం ఎపిసోడ్ ను నెట్టేశారు. కాంగ్రెస్ రెబ‌ల్ రాజ‌గోపాల్ రెడ్డి స‌స్పెన్ష‌న్ విష‌యంలో సీనియ‌ర్లు ఒక నిర్ణ‌యానికి వ‌స్తే బాగుంటుంద‌ని ఏఐసీపీకి రేవంత్ స‌ల‌హా ఇచ్చార‌ని తెలుస్తోంది. అటు సీనియ‌ర్లు ఇటు రేవంత్ బ్లేమ్ గేమ్ న‌డుమ రాజ‌గోపాల్ రెడ్డి స‌స్పెన్ష‌న్ వ్య‌వ‌హారం అట‌కెక్కింది.

Also Read:  Special Clinic For Transgenders: ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక క్లినిక్స్

కాంగ్రెస్ పార్టీలో రాజ‌గోపాల్ రెడ్డిని కొన‌సాగించడానికి ఉత్త‌మ్ అంట్ టీమ్ ప్ర‌య‌త్నం చేసింది. ఏఐసీపీ ఆదేశం మేర‌కు వాళ్లు ప్ర‌య‌త్నం చేశారు. కానీ, పార్టీలో కొన‌సాగాలంటే రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా తొల‌గించాల‌ని కండీష‌న్ పెట్టార‌ట‌. అంతేకాదు, ఆయ‌న‌కు ప్రాధాన్యం కాంగ్రెస్ పార్టీలో త‌గ్గించాల‌ని కోరాడ‌ని తెలుస్తోంది. ఆయ‌న పెట్టిన కండీష‌న్ల‌ను ఏఐసీసీ వ‌ద్ద ఉత్త‌మ్ అండ్ టీమ్ ఉంచింద‌ట‌. దీంతో ఏఐసీసీ కూడా ఏమీ తేల్చుకోలేని ప‌రిస్థితిలో ఉండిపోయింది. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జిగా ఉన్న మాణిక్ ఠాకూర్ మౌనంగా ఉండిపోయార‌ట‌. ఇలాంటి ప‌రిణామం నెల‌కొన‌డానికి కార‌ణం మునుగోడు ఉప ఎన్నిక వ‌స్తే, ఆ భారాన్ని ఎవ‌రు మోయాలి? అనే అంశం చుట్టూ తిరుగుతోంది.

Also Read: Amit Shah Sketch: `షా` స్కెచ్! టీఆర్ఎస్ పై ఆప‌రేష‌న్ `ఎల్లో`!!

మునుగోడు ఉప ఎన్నిక‌లు వ‌స్తే అక్క‌డ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్ర‌ధానంగా పోటీ ప‌డాల్సి వ‌స్తుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో ఉన్న బీజేపీ న‌డుమ కాంగ్రెస్ నెగ్గ‌డం ఈజీ కాదు. ఆ విష‌యాన్ని గ్ర‌హించిన సీనియ‌ర్లు మునుగోడు ఎపిసోడ్ మొత్తాన్ని రేవంత్ నెత్తిన వేయాల‌ని స్కెచ్ వేశారు. హుజారాబాద్ ఫ‌లితం త‌రువాత రేవంత్ దూకుడుగా వెళుతున్న‌ప్ప‌టికీ ఆ ఓట‌మి వెంటాడుతోంది. ఇప్పుడు మ‌ళ్లీ మునుగోడు ఉప ఎన్నిక వ‌స్తే మ‌రో ఓట‌మిని భ‌రించే శ‌క్తి రేవంత్ రెడ్డికి ఉండ‌క‌పోవ‌చ్చు. పైగా ఆ ఉప ఎన్నిక త‌రువాత వెంట‌నే సాధార‌ణ ఎన్నిక‌లు వ‌స్తున్నాయి. ఆ ప్ర‌భావం కాంగ్రెస్ పార్టీని నీడ‌లా వెంటాడుతుంది. అంతిమంగా సాధార‌ణ ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్ పార్టీ భారీ న‌ష్టాన్ని చ‌విచూడాల్సి వ‌స్తుంది. ప‌లు కోణాల నుంచి ఆలోచిస్తోన్న కాంగ్రెస్ అధిష్టానం రాజ‌గోపాల్ రెడ్డి వ్య‌వ‌హారాన్ని స్థానిక లీడ‌ర్ల‌కు వ‌దిలేసింది. దీంతో సీనియ‌ర్లు, రేవంత్ మ‌ధ్య బ్లేమ్ గేమ్ న‌డుస్తోంది. మొత్తం మీద కాంగ్రెస్ రెబ‌ల్ రాజ‌గోపాల్ రెడ్డి వ్య‌వ‌హారాన్ని అధిష్టానం కాలానికే వ‌దిలేసిన‌ట్టు క‌నిపిస్తోంది.