T BJP : అసరుద్దీన్ కు ఎస‌రు,MP అభ్య‌ర్థిగా కిర‌ణ్ కుమార్ రెడ్డి?

తెలంగాణ బీజేపీ (T BJP) వ్యూహాల‌కు ప‌దును పెట్టింది.బీఆర్ఎస్(BRS) పార్టీని దెబ్బ‌తీయ‌డానికి

  • Written By:
  • Updated On - March 13, 2023 / 02:40 PM IST

తెలంగాణ బీజేపీ (T BJP) వ్యూహాల‌కు ప‌దును పెట్టింది. ఈసారి బీఆర్ఎస్(BRS) పార్టీని కోలుకోకుండా దెబ్బ‌తీయ‌డానికి మాస్ట‌ర్ స్కెచ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ర‌చించారు. ఆ మేర‌కు ఆదివారం దిశానిర్దేశం చేసిన ఆయ‌న వ్యూహాల‌ను అమ‌లు చేయ‌డానికి దూకుడు పెంచింది. ఆ క్ర‌మంలో ఉమ్మ‌డి ఏపీలో కీల‌క భూమిక పోషించిన లీడ‌ర్ల‌ను గ్రేట‌ర్ హైద‌రాబాద్‌, రంగారెడ్డి, ఖ‌మ్మం జిల్లాల్లో పోటీ చేయించ‌డానికి సిద్ద‌మ‌వుతోంది. తెలంగాణ రాష్ట్రంతో బ‌లంగా సంబంధాలున్న ఏపీ మూలాలున్న లీడ‌ర్ల‌ను ఎంపిక చేసుకుంటోంది. ఆ క్ర‌మంలో మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డిని ఆక‌ర్షించిన‌ట్టు తెలుస్తోంది.

ఏపీ  లీడ‌ర్ల‌ను గ్రేట‌ర్ హైద‌రాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో పోటీ (T BJP)

బీఆర్ఎస్(BRS) బ‌లమంతా ఏపీ సెటిల‌ర్ల ఓట్లే. ఆ విష‌యాన్ని గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఫ‌లితాల త‌రువాత బీజేపీ(T BJP) గ్ర‌హించింది. ఆ ఎన్నిక‌ల్లో నార్త్ ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉన్న చోట టీఆర్ఎస్ పార్టీ నామ‌రూపాల్లేకుండా పోయింది. కేవ‌లం ఏపీ సెటిల‌ర్లు ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల్లో మాత్ర‌మే కార్పొరేట‌ర్ల‌ను టీఆర్ఎస్ గెలుచుకుంది. అంటే, సెటిల‌ర్లు ప్ర‌స్తుతం బీఆర్ఎస్ వైపు బ‌లంగా ఉన్నారు. అందుకే, ఏపీ మూలాలున్న బ‌ల‌మైన లీడ‌ర్ల‌ను హైద‌రాబాద్‌, రంగారెడ్డి జిల్లాల ప‌రిధిలోని నియోజ‌కవ‌ర్గాల్లో బ‌రిలోకి దింపనుంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన కిర‌ణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా అస‌రుద్దీన్ ఓవైసీ మీద పోటీ చేయించాల‌ని యోచిస్తోంద‌ట‌.

Also Read : T BJP : తెలంగాణకు ఢిల్లీ పెద్ద‌ల `ముంద‌స్తు`సంకేతం ! స్ట్రీట్ ఫైట్ కు దిశానిర్దేశం!!

ఓల్డ్ సీటీలో మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డికి ఫాలోయింగ్ ఉంది. పైగా ఆయ‌న హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ నుంచి నిజాం కాలేజి వ‌ర‌కు హైద‌రాబాద్ లోనే చ‌దువుకున్నారు. ముస్లిం లీడ‌ర్ల‌తోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయ‌నతో కలిసి చ‌దువుకున్నోళ్ల‌లో చాలా మంది ముస్లిం ప్ర‌ముఖులు ఉన్నారు. అంతేకాదు, ఆయ‌న సీఎంగా ఉండ‌గా ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ను అరెస్ట్ చేశారు. ఆ రోజు హిందూమ‌తాన్ని కించ‌ప‌రుస్తూ అక్బ‌రుద్దీన్ చేసిన వ్యాఖ్య‌ల మీద కిర‌ణ్ కుమార్ రెడ్డి సీరియ‌స్ అయ్యారు. వెంట‌నే అరెస్ట్ చేయించ‌డం సీఎంగా ఆయ‌న చేసిన పెద్ద సాహసం. అందుకే, ఇప్పుడు బీజేపీ ప్ర‌త్యేకంగా కిర‌ణ్ కుమార్ రెడ్డిని గుర్తించింది. రాబోవు ఎన్నిక‌ల్లో అస‌రుద్దీన్ మీద ఎంపీ అభ్య‌ర్థిగా (T BJP)నిల‌బెట్ట‌డం ద్వారా స‌క్సెస్ కావాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోంది.

కిర‌ణ్ కుమార్ రెడ్డి  సీఎంగా ఉండ‌గా ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ను అరెస్ట్

తెలంగాణ‌కు వ‌చ్చిన అమిత్ షా ఆదివారం స్థానిక కీల‌క లీడ‌ర్ల‌కు కొన్ని కీల‌క సంకేతాలు ఇచ్చారు. ఇత‌ర పార్టీల లీడ‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డానికి చేరిక‌ల క‌మిటీ వేసిన‌ప్ప‌టికీ ఫ‌లితం అంత‌గా రాలేదు. ఆ విష‌యాన్ని ప్ర‌ధానంగా ప్ర‌స్తావించిన అమిత్ షా ఇత‌ర పార్టీల లీడ‌ర్ల మీద దృష్టి పెట్టాల‌ని సంకేతాలు ఇచ్చారు. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు చెప్పుకోద‌గ్గ లీడ‌ర్లు బీజేపీ (T BJP) వైపు చూడ‌డంలేదు. కారణం ఇప్ప‌టికే బీజేపీలోని గ్రూపులు త‌ల‌నొప్పిగా ఉన్నాయి. ప్ర‌స్తుతం బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మీద వ్య‌తిరేకంగా ఒక గ్రూప్ బ‌లంగా ప‌నిచేస్తోంది. ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన సీనియ‌ర్ల‌కు బీజేపీ పెద్ద‌గా ప్రాధాన్యం ఇవ్వ‌డంలేదు. ఆ విష‌యం క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. అందుకే, ఇత‌ర పార్టీల నుంచి సీనియ‌ర్లు ఎవ‌రూ బీజేపీ వైపు చూడ‌డంలేదు.

Also Read : T BJP : ఈటెల‌కు బీజేపీ ప‌గ్గాలు, కేంద్ర మంత్రిగా `బండి`?

కాంగ్రెస్ పార్టీలోని లీడ‌ర్లు కూడా బీజేపీ వైపు చూడ్డాల‌ని సాహ‌సం చేయ‌లేక‌పోతున్నారు. ఇక బీఆర్ఎస్ (BRS) పార్టీ నుంచి 40 మంది లీడ‌ర్లు క‌మ‌లం వైపు చూస్తున్నార‌ని బండి సంజ‌య్ చెబుతున్నారు. రెండేళ్లుగా ఆయ‌న ఇదే విష‌యాన్ని చెబుతున్న‌ప్ప‌టికీ ఎక్క‌డా అలాంటి ప‌రిస్థితి క‌నిపించ‌డంలేదు. సిట్టింగ్ లు అంద‌రికీ 99శాతం మందికి టిక్కెట్లు మ‌ళ్లీ ఇస్తాన‌ని బీఆర్ఎస్ చీఫ్ చెప్ప‌డం జ‌రిగింది. అందుకే, ఎవ‌రూ బీజేపీ (T BJP)వైపు పెద్ద‌గా చూడ‌డంలేదు. ప్ర‌త్యామ్నాయంగా ఏపీ మూలాలున్న లీడ‌ర్ల‌ను ఎంపిక చేసుకుంటోంది.

  దివాక‌ర్ రెడ్డి   ఈసారి ఎన్నిక‌ల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ

హైద‌రాబాద్ కేంద్రంగా ఉన్న ఏపీ మూలాలున్న బ‌ల‌మైన లీడ‌ర్ల జాబితాను బీజేపీ (T BJP) త‌యారు చేసింది. వాళ్ల‌లో మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి ఒక‌రు. త్వ‌ర‌లోనే బీజేపీలోకి చేర‌తార‌ని తెలుస్తోంది. ఇక జేపీ బ్ర‌ద‌ర్స్ కూడా చాలా కాలంగా హైద‌రాబాద్ కేంద్రంగా పోటీ చేయాల‌ని చూస్తున్నారు. ఆ మ‌ధ్య జేపీ దివాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ ఈసారి ఎన్నిక‌ల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. అంటే, సెటిల‌ర్లు ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల్లో ఏపీ మూలాలున్న వాళ్ల‌ను దింప‌డానికి బీజేపీ సిద్ధ‌మ‌వుతోంది. ఫ‌లితంగా నార్త్ ఓట‌ర్లు ఉన్న చోటు బీజేపీ ఎలాగూ గెలుస్తుంది. ఇక ఏపీ సెటిల‌ర్లు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో కొత్త ప్ర‌యోగానికి బీజేపీ స‌న్నాహాలు చేస్తోంది. ఆ క్ర‌మంలోనే కిర‌ణ్ కుమార్ రెడ్డిని తెర‌మీద‌కు తీసుకురానుంది. ఇలా, తెలంగాణ వ్యాప్తంగా 40 నుంచి 50 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో సెటిల‌ర్ల ప్రాబ‌ల్యం ఉన్న చోట ప్ర‌యోగం చేయ‌నుంది. ఫ‌లితంగా బీఆర్ఎస్ (BRS) పార్టీకి భారీ న‌ష్టం జ‌రుగుతుంద‌ని బీజేపీ అంచ‌నా.

Also Read : BJP Blue Print: ఢిల్లీలో టీ బీజేపీ డ్రిల్, కవిత అరెస్ట్ పై బ్లూ ప్రింట్!