T BJP Dispute : మోడీ స‌భ‌ల‌కు బీజేపీ కీల‌క లీడ‌ర్ల డుమ్మా

T BJP Dispute : తెలంగాణ మీద బీజేపీ ఆశ‌లు వ‌దులుకోలేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజ్యాధికారం దిశ‌గా అడుగులు వేస్తోంది.

  • Written By:
  • Publish Date - October 3, 2023 / 05:28 PM IST

T BJP Dispute : తెలంగాణ మీద బీజేపీ ఆశ‌లు వ‌దులుకోలేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజ్యాధికారం దిశ‌గా అడుగులు వేస్తోంది. ఆ క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ మూడు రోజుల్లో రెండుసార్లు తెలంగాణ‌కు రావ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ప‌ర్య‌ట‌న కొంత మేర‌కు విజ‌య‌వంతం అయింద‌ని ఆ పార్టీ భావిస్తోంది. అక్క‌డ స‌భ‌లో గిరిజ‌న యూనివ‌ర్సిటీని ప్ర‌క‌టించారు. అంతేకాదు, ప‌సుపు బోర్డును కూడా ప్ర‌క‌టించ‌డం రైతుల్లో కొత్త ఉత్సాహం క‌నిపిస్తోంది. కానీ, కీల‌క బీజేపీ లీడ‌ర్లు మోడీ స‌భ‌కు మిస్ కావ‌డం విచిత్రం.

కీల‌క బీజేపీ లీడ‌ర్లు మోడీ స‌భ‌కు మిస్ కావ‌డం… (T BJP Dispute)

వాస్తవంగా రాజ్యాధికారం దిశ‌గా వేగంగా అడుగులు వేసిన బీజేపీ ఒక్క‌సారి ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ తరువాత తెలంగాణ‌లో ప‌డిపోయింది. దానికి కార‌ణం ఎమ్మెల్సీ క‌విత‌ను అరెస్ట్ చేయ‌క‌పోవ‌డం అనేది ఆ పార్టీలోని కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, ఈటెల రాజేంద్ర‌, వివేక్ తదిత‌రులు భావ‌న‌. అంతేకాదు, క‌ల్వ‌కుంట్ల కుటుంబం మీద ఉన్న ఆరోప‌ణ‌లు, ఫిర్యాదుల‌పై చ‌ర్య‌లు తీసుకోవడానికి కేంద్రం ముందుకు రాలేదు. ఫ‌లితంగా బీఆర్ఎస్, బీజేపీ ఒక‌టే అనే వాదానికి బ‌లం చేకూరింది. కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న ప్ర‌చారానికి బీజేపీ (T BJP Dispute) స‌హ‌కారం అందించిన‌ట్టు అయింది.

చంద్ర‌బాబును జైలులో పెట్టించ‌డం  వెనుక బీజేపీ పాత్ర

ఏపీలో కింగ్ మేక‌ర్, తెలంగాణ‌లో కింగ్ మేక‌ర్ కావాల‌ని బీజేపీ రాజ‌కీయ ల‌క్ష్యం. కానీ, ఆ రెండు అయ్యేలా క‌నిపించ‌డంలేదు. దానికి కార‌ణం తెలంగాణ‌లో ఎమ్మెల్సీ క‌విత‌ను లిక్క‌ర్ స్కామ్ లో వ‌దిలేయ‌డం అంటూ వాద‌న (T BJP Dispute) వినిపిస్తోంది. ఇక చంద్ర‌బాబును జైలులో పెట్టించ‌డం  వెనుక బీజేపీ పాత్ర ఉంద‌ని ఏపీ స‌మాజం నమ్ముతోంది. అందుకే, రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ల‌క్ష్యానికి దూరంగా ఉంద‌ని స‌ర్వేల సారాంశం. పైగా కేసీఆర్ తో మోడీ, షా ద్వ‌యం చేతులు క‌లిపార‌ని కాంగ్రెస్ చెబుతోంది. దానికి కార‌ణం ఫాంహౌస్ కేసు, ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ ఉన్నాయ‌ని తేట‌తెల్లం చేస్తోంది. దీంతో ఒక్క‌సారిగా తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ ప‌డిపోయింది. అందుకే, మోడీ స‌భ‌ల‌కు విజ‌య‌శాంతి, రాజ‌గోపాల్ రెడ్డి , వివేక్ క‌నిపించ‌డంలేదు.

బీజేపీ కీల‌క నేత‌లుగా ఉన్న కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి, ఈటెల రాజేంద్ర

బీజేపీ కీల‌క నేత‌లుగా ఉన్న కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి, ఈటెల రాజేంద్ర పాత్ర కూడా మోడీ స‌భ‌ల్లో త‌క్కువ‌గానే ఉంది. ఇటీవ‌ల తెలంగాణ‌కు వ‌చ్చిన అమిత్ షా కేవ‌లం కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్, ఈటెల తోనే భేటీ అయ్యారు. దీంతో సీనియ‌ర్ లీడ‌ర్లు దూరంగా బీజేపీకి జ‌రుగుతున్నారు. పార్టీలోని అంత‌ర్గ‌త ప‌రిణామాల‌పై ర‌హ‌స్యంగా మీటింగ్ లు పెట్టుకుంటున్నారు. ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను చూసుకుంటున్నార‌ని టాక్‌. ఇప్ప‌టికే ప‌లుమార్లు ర‌హ‌స్యంగా స‌మావేశాల‌ను నిర్వ‌హించుకున్న సీనియ‌ర్లు కొంద‌రు త్వ‌ర‌లోనే బీజేపీకి  (T BJP Dispute) గుడ్ బై చెబుతార‌ని వినికిడి.

Also Read : Jagan Delhi Secret : జ‌గ‌న్ `ముందు`కు..! ఢిల్లీ అందుకే..!!

నిజామాబాద్ మోడీ ర్యాలీలో కిష‌న్ రెడ్డి మాత్ర‌మే హైలెట్ అయ్యారు. అక్క‌డి ఎంపీ ధ‌ర్మ‌పురి అరవింద్ రోల్ కూడా తక్కువ‌గానే క‌నిపించింది. ప్ర‌చారం క‌మిటీ చైర్మ‌న్ ఈటెల ఉనికి అక్క‌డ పెద్ద‌గా లేదు.సీనియ‌ర్లు ఎక్క‌డా క‌నిపించ‌లేదు. దీంతో మోడీ రెండు స‌భ‌లు బీజేపీకి లాభమా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్నం అవుతోంది. పార్టీలోని అంత‌ర్గ‌త విభేదాల‌ను బ‌య‌ట‌పెట్టిన మోడీ స‌భ‌ల కార‌ణంగా న‌ష్ట‌మే ఎక్క‌వ‌నే అభిప్రాయం చాలా మందిలో ఉంది. నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తులు ఇప్పుడు బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉంది. త్వ‌ర‌లోనే బీజేపీకి కీల‌క లీడ‌ర్లు గుడ్ చెప్ప‌డానికి మోడీ రెండు స‌భ‌ల్లో క‌నిపించిన అనైక్య‌త నిదర్శ‌నంగా ఉంద‌ని చెప్ప‌డంలో సందేహం లేదు.

Also Read : Telangana: రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ నాయకుడు: కేటీఆర్ గరం