తెలుగు న్యూస్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ (Anchor Swetcha Votarkar) మరణ వార్త అందరినీ శోకసాగరంలో ముంచెత్తింది. జవహర్ నగర్‌లోని తన నివాసంలో గత రాత్రి 10:30 గంటలకు ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. స్వేచ్ఛ గత కొన్నేళ్లుగా పలు ప్రముఖ టీవీ ఛానల్స్‌లో జర్నలిస్టుగా, యాంకర్‌గా పని చేశారు. TUWJ (తెలుగు యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్) రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా కూడా ఆమె సేవలు అందించారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే స్వేచ్ఛ, ధైర్యంగా తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ వచ్చారు.
Post Offices: పోస్టాఫీసు వినియోగదారులకు శుభవార్త.. ఆగస్టు నుంచి ప్రారంభం!
స్వేచ్ఛ తండ్రి ఆరోపణల ప్రకారం.. ఆమె మృతికి కారణం పూర్ణచంద్రరావు అనే వ్యక్తి. స్వేచ్ఛ భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత తన కుమార్తెతో పాటు పూర్ణచంద్రరావుతో సహజీవనం చేస్తోంది. అతడు పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, తీరా మాట తప్పి, మానసికంగా వేధించాడని ఆమె తండ్రి పేర్కొన్నారు. ఇటీవల పూర్ణచంద్రరావుతో తరచూ గొడవలు జరుగుతున్నాయని, జూన్ 26న కూడా తన కుమార్తె బాధపడుతూ ఫోన్ చేసినట్లు తెలిపారు. ఇదంతా ఆమె మానసిక స్థితిని దెబ్బతీసి, ఆత్మహత్యకు దారి తీసిందని ఆయన ఆరోపించారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
Kolkata gang Rape Case : పెళ్లికి నిరాకరించడమే ఆమె చేసిన తప్పా..?
స్వేచ్ఛ ఆత్మహత్యకు ముందు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం, ఆ ఫోటోల్లో ధ్యానం, ప్రశాంతత, ప్రకృతి వంటి అంశాలు పోస్ట్ చేయడం ఆమె మనోభావాలను తెలియజేస్తున్నాయని అంటున్నారు. “మనస్సు నిశ్శబ్దంగా ఉంటే ఆత్మ మాట్లాడుతుంది” అనే బుద్ధుడి కోటేషన్‌ను క్యాప్షన్‌గా పెట్టడం ఆమె అంతర్గత బాధను సూచించేలా ఉంది. అంతేకాదు సముద్ర తీరాన మరో వ్యక్తితో కలిసి ఉన్న ఫోటోలు కూడా ఆమె చివరి రోజుల్లో అన్వేషణలో, ఒంటరితనంతో పోరాడుతున్న ఆమెను చూపుతున్నట్లు భావిస్తున్నారు.
ఆమె మృతిపై సహోద్యోగులు, స్నేహితులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రముఖ యాంకర్ దేవి భావోద్వేగంతో “పోరాడు గెలువు అన్నావు నువ్వు ఎందుకు ఓడిపోయావు?” అంటూ స్పందించగా, యాంకర్ ఊహ కూడా స్వేచ్ఛతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. ఆమె స్పష్టమైన ఆలోచనలు, నిర్భయమైన ఆవిష్కరణలు,
సాధించిన విజయాలు ఆమెను మిగతా జర్నలిస్టుల్లో ప్రత్యేకంగా నిలిపాయి. అలాంటి స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడం మానవ సంబంధాలపై ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతోంది అంటూ పోస్ట్ చేసింది.