Swami Vivekananda Speech : ఇవాళ (జనవరి 12) స్వామి వివేకానంద జయంతి మహోత్సవం. ఆయన 1893 సెప్టెంబర్ 11న అమెరికాలోని చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో ప్రసంగించారు. ఆ ప్రసంగం ప్రపంచ ఖ్యాతిని గడించింది. అయితే ఆ ప్రసంగానికి మన హైదరాబాద్ నగరంలో లింక్ ఉంది. అదేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Rs 70 Lakhs Bitcoins Looted : కొత్తకోటలో బిట్ కాయిన్ ట్రేడర్‌కు కుచ్చుటోపీ.. రూ.70 లక్షల కాయిన్స్ లూటీ
స్వామి వివేకానంద గురువు పేరు రామకృష్ణ పరమహంస. తన సందేశం వివేకానంద ద్వారా యావత్ ప్రపంచానికి చేరాలని రామకృష్ణ భావిస్తుండేవారు. 1886లో రామకృష్ణ పరమహంసకు గొంతు క్యాన్సర్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన తన శిష్యులను పిలిచి వివేకానంద తన వారసుడని ప్రకటించారు. 1886 ఆగస్టు 16న రామకృష్ణ పరమహంస మహాసమాధిలోకి వెళ్లిపోయారు. తన గురువు చెప్పిన ప్రకారం యావత్ ప్రపంచానికి హిందూమతం, భారతదేశం ఔన్నత్యాన్ని చాటిచెప్పాలని స్వామి వివేకానంద నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో తొలుత ఆయన వారణాసి (ఉత్తరప్రదేశ్), సారనాథ్ (ఉత్తరప్రదేశ్), అయోధ్య(ఉత్తరప్రదేశ్), లక్నో(ఉత్తరప్రదేశ్), ఆగ్రా(ఉత్తరప్రదేశ్), ముంబై(మహారాష్ట్ర), పూణే(మహారాష్ట్ర), బెంగళూరు(కర్ణాటక)లలో పర్యటించారు.
Also Read :Anil Ambani : అచ్యుతాపురం సెజ్ వైపు.. అనిల్ అంబానీ చూపు.. ఎందుకు ?
ఖర్చును భరిస్తానన్న మైసూరు మహారాజా
ఈ పర్యటనలలో భాగంగా 1892 నవంబరులో మైసూరుకు స్వామి వివేకానంద(Swami Vivekananda Speech) చేరుకున్నారు. మైసూరు మహారాజా అతిథిగా అక్కడ కొన్ని రోజుల పాటు బస చేశారు. అమెరికాకు వెళ్లి భారతీయ సంస్కృతి గురించి, సనాతన ధర్మం గురించి ప్రపంచానికి పరిచయం చేయాలని ఉందని మైసూరు మహారాజాతో స్వామీజీ అన్నారు. దీంతో అమెరికా పర్యటకు అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని మహారాజా తెలిపారు. అయితే తొలుత అందుకు వివేకానంద ఒప్పుకోలేదు. కొన్ని రోజుల తర్వాత అందుకు అంగీకరించారు. అమెరికా పర్యటనకు వెళ్లాలనే నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత.. స్వామి వివేకానంద నిజాం పరిపాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రానికి వచ్చారు. ఆయన తన జీవితంలో తొలిసారిగా బహిరంగసభలో ప్రసంగించింది మన హైదరాబాద్‌లోనే. ఈవిషయం అతి కొద్దిమందికి తెలుసు.
Also Read :National Youth Day : స్వామి వివేకానంద జయంతి నాడు జాతీయ యువజన దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు..?
స్వామి వివేకానంద హైదరాబాద్ పర్యటన విశేషాలు..
- 1893 ఫిబ్రవరి 11 నుంచి 17 వరకు స్వామి వివేకానంద హైదరాబాద్‌లో పర్యటించారు.
- ఫిబ్రవరి 13న సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో మై మిషన్ టు ద వెస్ట్ (పాశ్చాత్యానికి వెళ్లడంలోని నా ఉద్దేశం) అనే అంశంపై చారిత్రక ప్రసంగం చేశారు. దీనికి వెయ్యిమంది హాజరయ్యారు.
- అమెరికాలోని చికాగోలో విశ్వమత ప్రతినిధుల సభలో పాల్గొనడానికి వెళ్లే ముందు హైదరాబాద్ బహిరంగ సభలో ప్రసంగించడం ద్వారా తన ఉపన్యాస నైపుణ్యాలను పరీక్షించుకున్నట్లు స్వామి వివేకానంద తన శిష్యులతో స్వయంగా చెప్పారు.
- హైదరాబాద్ పర్యటనలో ఉన్న టైంలో స్వామి వివేకానంద.. నిజాం ప్రభుత్వంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ గా పని చేస్తున్న బాబు మధుసూదన్ ఛటర్జీ ఇంట్లో బస చేశారు.
- నాటి హైదరాబాద్ ప్రధాన మంత్రి సర్ అస్మన్ జాను కూడా ఆయన కలిశారు.