సూర్యాపేట (Suryapet ) వాసులు ఎన్నేళ్లుగా ఎదురుచూస్తున్న రైల్వే కనెక్టివిటీ కల (Railway Line) ఇప్పుడు నెరవేరనుంది. కేంద్ర రైల్వే శాఖ తాజాగా సూర్యాపేట మీదుగా వెళ్లే రెండు ప్రధాన రైల్వే లైన్లకు ఆమోదం తెలిపింది. శంషాబాద్ నుంచి విశాఖపట్నం వరకు ప్రతిపాదించిన హైస్పీడ్ రైలు కారిడార్‌లో భాగంగా, సూర్యాపేట – నల్లగొండ మీదుగా రైలు లైన్ ఏర్పాటుకు ఫైనల్ లోకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్) కు గ్రీన్‌సిగ్నల్ లభించింది.
Jr NTRs Birthday : జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే.. కెరీర్‌లోని కీలక ఘట్టాలివీ
ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైల్వే అభివృద్ధికి నిధుల కేటాయింపులు కొనసాగుతున్నాయి. ఇటీవల విడుదలైన రైల్వే బడ్జెట్ పింక్ బుక్‌లో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అనేక ప్రాజెక్టులకు, సర్వేలకు నిధులు కేటాయించిన వివరాలు ఉన్నాయి. సూర్యాపేట మీదుగా శంషాబాద్-విశాఖపట్నం, విజయవాడ-కర్నూల్ హైస్పీడ్ రైల్వే మార్గాలకు ఇప్పటికే ప్రిలిమినరీ ఇంజినీరింగ్ ట్రాఫిక్ సర్వే పూర్తవగా, వాటిని ఈ ఏడాది బడ్జెట్‌లో చేర్చారు.
ఈ మేరకు కేంద్రం హైస్పీడ్ కారిడార్ సర్వే కోసం రూ.4.71 కోట్లు, అలాగే డోర్నకల్-గద్వాల వరకు 296 కిలోమీటర్ల రైల్వే లైన్ కోసం రూ.7.40 కోట్లు కేటాయించింది. ఈ మార్గం సూర్యాపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి మీదుగా గద్వాలను కలుపనుంది. రైల్వే శాఖ ఈ ప్రాజెక్టులను కార్యరూపం దాల్చిస్తే, సూర్యాపేట జిల్లాలో ఉన్నవారికి రవాణా సౌకర్యాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయి. ఇది నిజంగా సూర్యాపేట ప్రజల కోసం ఏళ్లుగా ఉన్న ఆకాంక్షకు గుండె చప్పుడు లాంటిదిగా మారుతోంది.