Konda Surekha : మంత్రి వర్గం నుండి సురేఖ అవుట్..? క్లారిటీ వచ్చేసింది

Konda Surekha : సోషల్ మీడియాలో కొందరు కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.

Published By: HashtagU Telugu Desk
Konda Surekha Minister Post

Konda Surekha Minister Post

నాగార్జున (Nagarjuna) , సమంత(Samantha)ల ఫై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ఫై అధిష్టానం చర్యలు తీసుకుందని , ఆమెను మంత్రి వర్గం నుండి తొలగించబోతున్నారని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల చిత్రసీమ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం, అటు అక్కినేని అభిమానులు రోడ్ల పైకి వచ్చి సురేఖ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం..సాటి మహిళలు సైతం సురేఖ వ్యాఖ్యల పట్ల వ్యతిరేకత చూపడం తో అధిష్టానం సురేఖ ఫై సీరియస్ అయ్యిందని, ఈ మేరకే సీఎం రేవంత్ తో చర్చించిన అగ్ర నాయకత్వం కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి బర్తరాఫ్ చేయాలని ఆదేశించినట్లు , ముందుగా రాజీనామా చేయాలని సురేఖను కోరాలని సూచించినట్లు ,ఆమె తప్పుకోవడానికి నిరాకరిస్తే వేటు వేయాలని హైకమాండ్ రేవంత్ రెడ్డికి స్పష్టం చేసినట్లు ప్రచారం మొదలైంది. ఈ ప్రచారం చూసి ఆమె వర్గీయులు , కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు గురి అవుతున్నారు. ఈ క్రమంలో ఈ ప్రచారం ఫై పీసీసీ చీఫ్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. సురేఖ పై జరుగుతున్న ప్రచారాన్ని PCC చీఫ్ మహేశ్ కుమార్ ఖండించారు. ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో వివాదం ముగిసిందని తెలిపారు. దీనిపై ఏఐసీసీ ఎలాంటి వివరణ అడగలేదని మీడియాకు చెప్పారు. సోషల్ మీడియాలో కొందరు కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. స్థానిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ కార్య కర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

అసలు సురేఖ ఏమన్నదనేది చూస్తే..

నాగ చైతన్య – సమంత ( Naga Chaitanya – Samantha Divorce ) విడిపోవడానికి కేటీఆర్ కరణ అంటూ సురేఖ కీలక వ్యాఖ్యలు చేసారు. N కన్వెన్షన్ (N Convention) కూల్చకుండా ఉండాలంటే సమంత ను తన దగ్గరికి పంపాలని కేటీఆర్ డిమాండ్ చేయడం తో.. నాగార్జున..సమంత ను కేటీఆర్ దగ్గరికి వెళ్లాలని ఫోర్స్ చేసాడు..కానీ సమంత ఒప్పుకోలేదు…అలాంటి పని చేయనంటే..చేయనని తేల్చి చెప్పడం తో..కుటుంబంలో గొడవలు జరిగాయి. కేటీఆర్ దగ్గరికి వెళ్లకపోతే మా ఇంట్లో ఉండొద్దని నాగార్జున తెచ్చి చెప్పడంతో..ఆ పని చేయలేక సమంత విడాకులు తీసుకుంది. నాగ చైతన్య – సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే అని తేల్చి చెప్పింది. రకుల్ ప్రీతీ సింగ్ త్వరగా పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా కేటీఆరే అని పలువురు హీరోయిన్స్ కు మత్తుమందు అలవాటు చేసింది కేటీఆరే అని సురేఖ తెలిపింది. మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు చిత్రసీమ తో పాటు ఇటు రాజకీయాల్లో ప్రకంపనలు రేపాయి. కొండా సురేఖ చెప్పిందట్లో ఎంత నిజం ఉంది..? ఎలాంటి ఆధారాలు ఉన్నాయి..? ఓ కన్వెన్షన్ కోసం నాగార్జున ఇంత దిగజారుతారా..? కొడుకు భార్య ను మరో వ్యక్తి దగ్గరికి పంపిస్తాడా..? ఇదేమైనా సినిమానా..? ఇలాంటి వ్యాఖ్యలు కొండా సురేఖ ఎలా చేసింది..? ఓ హోదా లో ఉన్న ఆమె..మరో మహిళా ఫై ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేయడం ఏంటి..? హీరోయిన్లు అంటే కేవలం అలాంటి పనులకేనా..? అని అభిమానులు , నెటిజన్లు, యావత్ తెలుగు ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఇటు నాగార్జున సైతం ఆమెపై నాంపల్లి కోర్ట్ లో పరువునష్టం దావా వేశారు. ఈరోజు దీనిపై విచారణ జరగనుంది. శుక్రవారం విచారణ జరగాల్సి ఉండగా జడ్జి సెలవులో ఉండటంతో ఈరోజుకు వాయిదా పడింది. కోర్టు ఎలా స్పందిస్తుందోననే ఆసక్తి నెలకొంది.

Read Also : Telugu Desam Party: టీడీపీలో చీలిక‌.. బ‌య‌ట‌ప‌డిన విభేదాలు!

  Last Updated: 07 Oct 2024, 07:48 AM IST