Site icon HashtagU Telugu

VIral Video: మరో వివాదంలో కొండా సురేఖ..!

Surekha New Video

Surekha New Video

మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) ఇటీవల వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తున్నారు. చేసే కామెంట్స్ మాత్రమే కాదు చేసే పనులు కూడా ఆమెను వివాదాల్లోకి నెట్టిస్తున్నాయి. ఆ మధ్య నాగార్జున ఫ్యామిలీ పై అలాగే సమంత పై చేసిన కామెంట్స్ ఆమెను వివాదాల్లో కేరాఫ్ గా నిలపడమే కాదు యావత్ సినీ ప్రముఖులు , అభిమానులు , చిత్రసీమ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసాయి. నాగార్జున అయితే అమెపై పరువు నష్టం దావా కూడా వేశారు. ఈ కేసుకు సంబదించిన తీర్పు విచారణ ఈరోజు జరగనుంది.

ఇదిలా ఉండగా ..రాత్రి నుండి సురేఖ కు సంబదించిన కొన్ని వీడియోస్ వైరల్ గా మారాయి. ఇన్స్టాగ్రామ్ లైవ్లో మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అందులో ఆమె తన ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఆ వీడియో లో ఆమె ఏమని మాట్లాడిందంటే..ఓ యువతితో సురేఖ మట్లాడుతూ… ఈ రోజు మా అందరికీ పండుగ ఉంది. బిర్యానీలు తెప్పిస్తా ఉన్నము.. చిన్న పాప పేరుతోటి. మా టీమ్‌ టీమంతా కూడా ఇవాళ ఫుల్‌ ఎంజాయ్‌. బిర్యానీ ఉంటే బీర్‌ ఉంటది కదమ్మా పాపము. అఫీషియల్‌ సెలేబ్రేషన్‌ అంటే అఫీషియల్‌గా ఇచ్చేది. ఇగ అన్‌అఫీషియల్‌గా అంటే.. అన్నారు. మరో వీడియోలో ఎవరు ఎక్కువ డ్యాన్స్‌ చేస్తే వాళ్లకు మందు ఎక్కువ అని చెప్తున్నా అన్నారు. మూడో వీడియోలో బిర్యానీలు నడుస్తున్నయి.. అట్లనే సల్లవడుడు కూడా నడుస్తున్నది అని మంత్రి మాట్లాడారు. ఇప్పుడు ఈ వీడియోలపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి సురేఖ ఇంటిలో పోలీసులు సోదాలు చేయాలని, పార్టీకి పర్మిషన్‌ ఉందా? మందు పార్టీనా? డ్రగ్స్‌ పార్టీనా? రేవ్‌ పార్టీనా? తేల్చాలని కొందరు పోస్టులు పెడుతున్నారు.

మరి ఈ వీడియోస్ పై సురేఖ ఏమని సమాధానం చెపుతుందో చూడాలి.

Read Also : Vivo Y300 Launch: మార్కెట్ లోకి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని తీసుకువచ్చిన వివో.. ధర, ఫీచర్స్ ఇవే!

Exit mobile version