Supreme Court : కంచగచ్చిబౌలి ప్రాంతంలో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు మరోసారి కఠినంగా స్పందించింది. పర్యావరణ పరిరక్షణను విస్మరించి అక్రమంగా చెట్లు నరికి, భూభాగాన్ని వినియోగిస్తే అధికారులు శిక్ష తప్పదని కోర్టు స్పష్టంగా హెచ్చరించింది. “నరికిన చెట్ల స్థానంలో తగినంత మొక్కలు నాటి, పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించండి. లేకపోతే జైలుకు పంపాల్సి వస్తుంది” అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
ఈరోజు (బుధవారం) సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం హెచ్‌సీయూ సమీపంలోని కంచగచ్చిబౌలి భూముల కేసును విచారించింది. ఇటీవల ఈ ప్రాంతంలో జరిగిన విస్తృత చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు సుమోటో విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. గత విచారణలోనే ధర్మాసనం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి, పర్యావరణ పునరుద్ధరణ చర్యలు తీసుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Bihar : బీహార్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరనపై దద్దరిల్లిన బీహార్ అసెంబ్లీ
ఈరోజు విచారణలో తెలంగాణ ప్రభుత్వం మంగళవారం దాఖలు చేసిన అఫిడవిట్‌ను సుప్రీంకోర్టు పరిశీలించింది. ప్రభుత్వం సమర్పించిన నివేదికలో కంచగచ్చిబౌలి ప్రాంతంలోని పనులు నిలిపివేసి, నరికిన చెట్ల స్థానంలో మొక్కలు నాటే చర్యలు ప్రారంభించామని పేర్కొంది. అంతేకాక, భూమి వినియోగంపై పర్యావరణ నియమాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది.
అయితే, అఫిడవిట్‌లోని వివరాలను అమికస్ క్యూరీ సమీక్షించాలని కోరడంతో కోర్టు విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది. తదుపరి విచారణకు ముందుగా, పర్యావరణ పునరుద్ధరణకు సంబంధించిన వివరమైన నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఉన్నతాధికారులను జైలుకు పంపుతామని సీజేఐ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్రంగా హెచ్చరించింది. “కంచగచ్చిబౌలి అటవీ ప్రాంతంలోనే ప్రత్యేక జైలు నిర్మించి, నిర్లక్ష్యానికి పాల్పడిన అధికారులను అందులో ఖైదు చేస్తాం” అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
కంచగచ్చిబౌలి ప్రాంతం హైదరాబాద్ పరిసరాల్లో గ్రీన్ బెల్ట్‌గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ విస్తృతంగా చెట్ల నరికివేత జరగడం పట్ల పర్యావరణవేత్తలు, స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ నిపుణుల ప్రకారం, ఇక్కడ జరిగే అటవీ నష్టం కేవలం స్థానిక వాతావరణానికే కాకుండా, భూగర్భ జలాల నిల్వలు, గాలి నాణ్యత, జీవవైవిధ్యంపై తీవ్రమైన ప్రభావం చూపవచ్చని హెచ్చరికలు ఉన్నాయి.
పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత అని కోర్టు గుర్తుచేసింది. నరికిన ప్రతి చెట్టు స్థానంలో కనీసం ఐదు మొక్కలు నాటాలని, వాటిని పరిరక్షించడంలో విఫలమైతే కఠిన చర్యలు తప్పవని స్పష్టంగా పేర్కొంది.
Dhankhar To QUIT : జగదీప్ ధన్కడ్ రాజీనామా చేయడానికి కారణాలు ఏంటి..?