MLC Kavitha : కవిత పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ.. సర్వత్రా ఉత్కంఠ

MLC Kavitha : మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించడాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది.

  • Written By:
  • Publish Date - September 26, 2023 / 07:04 AM IST

MLC Kavitha : మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించడాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్‌ సుధాన్షు ధూలియాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది. ఈడీ దర్యాప్తును సవాల్ చేస్తూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం భార్య నళినీ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్లతో కలిపి కవిత పిటిషన్ ను దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ విచారించనుంది.

Also read:  Suicide : ల‌క్నోలోని బీజేపీ ఎమ్మెల్యే నివాసంలో వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌

ఈరోజు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో ఈడీ అఫిడవిట్ దాఖలు చేసే అవకాశం ఉంది. కవితకు తాజాగా ఈడీ నోటీసులు అందిన వెంటనే ఆమె తరఫు న్యాయవాదులు ఈవిషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.  నళినీ చిందబరం తరహాలోనే కవితకూ ఊరట ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్​ వేశారు. దీన్ని విచారించిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం ఈ నెల 26 వరకు కవితకు సమన్లు జారీ చేయవద్దని ఈడీకి ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద ఇవాళ సుప్రీంకోర్టులో కవిత (MLC Kavitha) పిటిషన్ పై విచారణ ఎలా జరగనుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.