Dr Nageshwar Reddy : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న తెల్లవారుజామున జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా కలకలం క్రియేట్ చేసింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈసందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలో వైద్యుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసి సిఫారసులు చేసేందుకు నేషనల్ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. ఈ టాస్క్ ఫోర్స్‌లో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కూడా సభ్యులుగా ఉంటారని సుప్రీంకోర్టు తెలిపింది. ఈనేపథ్యంలో ఆయనకు సంబంధించిన వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
దేశసేవ కోసం విదేశీ ఆఫర్లను వదులుకొని..
హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) హాస్పిటల్ అంటే తెలియనిది ఎవరికి !! ఆ ఆస్పత్రి చాలా ఫేమస్. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. గ్యాస్ట్రో చికిత్సలో ఆయనకు దేశంలోనే చాలా మంచి పేరుంది. విదేశాల్లో నాగేశ్వర్ రెడ్డికి చాలా పెద్ద ఆఫర్లు వచ్చినా ఆయన వెళ్లలేదు. దేశ ప్రజలకే సేవ చేయాలని నాగేశ్వర్ రెడ్డి నిర్ణయించుకున్నారు. అందుకే ఆయన హైదరాబాద్‌లో తన ఏఐజీ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. విదేశీ వైద్యులు కూడా వచ్చి ఆయన ఆస్పత్రిలో ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు.
Also Read :Jio Recharge Plan : రిలయన్స్ జియో చౌక రీఛార్జ్ ప్లాన్.. ధర, వ్యాలిడిటీ వివరాలివీ
డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి మొదటి నుంచీ సేవాభావం ఎక్కువ. ఆయన చాలా సామాజిక బాధ్యత కలిగిన డాక్టర్. వైద్యరంగంలో రీసెర్చ్ చేయాలనే ఆసక్తి ఆయనకు మొదటి నుంచీ ఉండేది. అందుకే గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో నాగేశ్వర్ రెడ్డి అంత పెద్ద నిష్ణాతుడిగా ఎదిగారు. ప్రపంచస్థాయిలో గుర్తింపును సాధించారు. ‘‘క్యాన్సర్ చికిత్స కోసం ప్రభుత్వాలు చాలా ఖర్చు చేస్తుంటాయి. కానీ దానికి మందును కనిపెట్టడంపై పనిచేయవు. ఇది చాలా బాధాకరమైన అంశం. క్యాన్సర్‌కు వ్యాక్సిన్‌ను కనిపెడితే ఈ భారీ చికిత్స ఖర్చు రోగుల ఫ్యామిలీకి మిగిలిపోతుంది’’ అని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి చెబుతుంటారు. పేదలపై ఆర్థిక భారాన్ని తగ్గించేలా వైద్యరంగంలో ఆవిష్కరణలు జరగాల్సిన అవసరం ఉందని ఆయన అంటారు. ‘‘మంచి వైద్యం కోసం డబ్బు అవసరం. మంచి డాక్టరుకు ఎక్కువ వేతనం ఇవ్వాలి’’ అని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి అభిప్రాయపడుతుంటారు. ‘‘డాక్టర్లు అంటే బాగా డబ్బులు సంపాదిస్తారని, డబ్బు కోసమే వైద్యం చేస్తారనే భావన ప్రజల్లో ఉంది. అందువల్లే డాక్టర్లపై దాడులు జరుగుతుంటాయి. ఈవిషయంలో మార్పు రావాలంటే డాక్టర్లే చొరవ తీసుకోవాలి ’’ అని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి చెబుతుంటారు. ఇలాంటి ఆదర్శవంతమైన ఆలోచనా విధానం ఉంది కాబట్టే డాక్టర్ల భద్రతపై ఏర్పాటు చేసిన నేషనల్ టాస్క్‌ఫోర్స్ కోసం డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి పేరును సుప్రీంకోర్టు సూచించింది.
డాక్టర్ల భద్రతపై టాస్క్‌ఫోర్స్.. 10 మంది సభ్యులు వీరే
- డాక్టర్ల భద్రతపై ఏర్పాటు చేసిన నేషనల్ టాస్క్‌ఫోర్స్‌కు ఛైర్మన్‌గా వైస్ అడ్మిరల్ డా. ఆర్కే సరైన్ ఉంటారు.
- హైదరాబాద్‌కు చెందని ప్రఖ్యాత గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్య నిపుణుడు, ఏఐజీ ఛైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి ఇందులో సభ్యుడిగా ఉంటారు.
- ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డా. ఎం. శ్రీనివాస్, బెంగళూరు NIMHANS వైద్యులు డా. ప్రతిమమూర్తి, డాక్టర్ గోవర్దన్ దత్తపురి, డాక్టర్ సౌమిత్రారావత్, డాక్టర్ పద్మ శ్రీవాస్తవ ఈ టీంలో సభ్యులుగా పని చేయనున్నారు.
- ఈ టాస్క్‌ఫోర్స్ సభ్యులంతా కలిసి డాక్టర్ల భద్రతకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేస్తారు.
- మూడోవారాల్లోగా మధ్యంతర నివేదిక, 2 నెలల్లో పూర్తి నివేదికను ఇవ్వాలని ఈ టాస్క్‌ఫోర్స్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.