హైదరాబాద్ నగర ప్రజలకు మరోసారి శుభవార్త. ప్రతీ నెలలో నాలుగో ఆదివారం ప్రత్యేకంగా నిర్వహించే ‘సండే ఫన్ డే’ (Sunday-Fun Day)కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించేందుకు హెచ్ఎండీఏ(HMDA) సన్నాహాలు చేస్తున్నది. గతంలో ట్యాంక్ బండ్‌పై జరిగిన ఈ కార్యక్రమం ప్రజల నుంచి విశేష స్పందనను తెచ్చుకుంది. కొంతకాలంగా ఈ ఫన్ డే ఆగిపోయినప్పటికీ ఇప్పుడు మళ్లీ అదే ఉత్సాహంతో ఇది తిరిగి వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది.
Sunil Gavaskar: ఈసారి ఐపీఎల్ కప్ ఆర్సీబీదే.. జోస్యం చెప్పిన మాజీ క్రికెటర్!
ఈ నెల 18వ తేదీ నుంచి కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించనున్నట్లు సమాచారం. ట్యాంక్ బండ్ వద్ద రోడ్‌ను ట్రాఫిక్‌కు మూసి వేసి, కుటుంబ సభ్యులు కలిసి వచ్చి వినోదాన్ని ఆస్వాదించేలా రంగులు వేసే ఈ కార్యక్రమం, పర్యాటక రంగాన్ని కూడా ఉత్సాహపరచేలా ఉంటుంది. అందాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ స్టాల్స్, మ్యూజికల్ ప్రదర్శనలతో కలిసిన ఈ ఆదివారం వేదిక, నగర ప్రజలకు విశేష అనుభూతిని అందిస్తుంది.
ఇక ఈసారి ట్యాంక్ బండ్‌పై సండే ఫన్ డే సందర్భంగా అందాల పోటీలు, వివిధ కళా ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేయాలనే యోచనలో ఉంది హెచ్ఎండీఏ. పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించేందుకు, స్థానిక కళాకారులకు ప్రోత్సాహం ఇవ్వడానికే ఈ కార్యక్రమం ఓ గొప్ప వేదికగా నిలవనుంది. దీంతో పాటు కుటుంబాలతో సహా ప్రజలు సమయం గడిపేలా అవసరమైన భద్రత, పార్కింగ్ ఏర్పాట్లు చేయనున్నారు.