Sukesh Chandrashekhar : మీకు ‘జైలు సమయం’ ఆసన్నమైంది కేటీఆర్ – సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

మీకు 'జైలు సమయం' అస్సన్నమైంది కేటీఆర్ అంటూ జైలు నుంచి తన అడ్వకేట్ ద్వారా పంపిన లేఖ ఇప్పుడు వైరల్ గా మారింది

Published By: HashtagU Telugu Desk
Sukesh Chandrashekhar Letter To Ktr

Sukesh Chandrashekhar Letter To Ktr

సుఖేష్ చంద్రశేఖర్ (Sukesh Chandrashekhar ) మరో బాంబ్ పేల్చాడు. మనీలాండరింగ్‌ కేసు (Money Laundering Case)లో మండోలిలో జైలు జీవితం అనుభవిస్తున్న సుఖేష్‌ చంద్రశేఖర్‌.. కేటీఆర్ , కవితలను టార్గెట్ చేస్తూ మరో లేఖను విడుదల చేసారు. మీకు ‘జైలు సమయం’ అస్సన్నమైంది కేటీఆర్ (KTR) అంటూ జైలు నుంచి తన అడ్వకేట్ ద్వారా పంపిన లేఖ ఇప్పుడు వైరల్ గా మారింది.

‘డియర్ కేటీఆర్ బ్రదర్, కె.కవిత అక్కయ్య.. మొదట అసెంబ్లీ ఎన్నికల్లో మీరు సాధించిన ఫలితాలకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నారు. మీ అబద్ధాలు, మీ అత్యాశలు, మీ అవినీతి నా తెలుగు ప్రజలందరికి అర్థమైనట్లే ..మీ అహంకారం, బూటకపు పరాక్రమాలు అన్ని అంతం అవుతాయని నేను కొన్ని నెలల క్రితం నా పత్రికా ప్రకటనల్లో చెప్పా..ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అదే తీర్పు ఇచ్చారు. మీకు ఇచ్చిన సంపూర్ణ అధికారాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు. మీ అవినీతిని అహంకారాన్ని అందరూ అర్థం చేసుకున్నారు. మీరు నన్ను మోసగాడు అని పిలిచారు. కానీ ఈరోజు మీరు అదే స్థానానికి వచ్చారు. ఇప్పుడు మీకు నాకు పెద్దగా తేడా లేదు. మీ అవినీతి విషయంలో నిజాయితీని నిరూపించుకునేందుకు మీరంతా సిద్ధంగా ఉండండి. త్వరలోనే మీరు మీ భాగస్వాములైన కట్టర్ అవినీతి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులతో జైలు క్లబ్ లో చేరుతారు.

We’re now on WhatsApp. Click to Join.

మీకు కౌంట్‌డౌన్‌ మొదలైంది బ్రదర్.. త్వరలోనే జైలుకి వెళ్తారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అలాగే కవిత చట్టబద్దంగా విచారణ ఎదుర్కోవాలని కోరుకుంటున్నానని లేఖలో పేర్కొన్నారు. న్యాయ స్థానాలు, సామాన్య జనం కంటే ఎవరు పెద్దవారు కాదని.. వారి నిర్ణయమే తుది నిర్ణయమన్నారు.

అలాగే త్వరలోనే మీరు మీకు ఇష్టమైన ఇల్లు కలిగిన ‘అమెరికా’ దేశానికి వెళ్లిపోతారని నేను కచ్చితంగా అనుకుంటున్నాన్నారు. ఫలితాల రోజు ఎక్స్ (ట్విట్టర్) లో తుపాకీ పట్టుకుని 3.0 అని మీరు పోస్ట్ చేయడం నేను చూశారు. కానీ నిజాయితీగా అంచనా వేస్తే మిమ్మల్ని మీరు ఫూల్ అవుట్ చేయాలనుకున్నారు. మీరు చెబుతున్న 3.0 ‘జైలు సమయం’ త్వరలోనే జరుగుతుంది. అంతకు మించి ఏమీ లేదు కేటీఆర్ బ్రదర్. చివరగా కామారెడ్డిలో నిజమైన స్టార్ కిల్లర్ మీరే కేటీఆర్ అన్న. స్లేయర్ గ్రాండ్ విక్టరీకి నేను కేటీఆర్ అన్నకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు అభినందనలు’ అంటూ లేఖలో రాసుకొచ్చారు.

Read Also :  PM Modi: కేసీఆర్ త్వరగా కోలుకోవాలంటూ మోడీ ట్వీట్

  Last Updated: 08 Dec 2023, 03:31 PM IST