Site icon HashtagU Telugu

Sukesh Letter To MLC Kavitha : తీహార్ జైలులో కవితను కలుస్తా – సుకేశ్ చంద్రశేఖర్

Sukesh Chandrasekhar Letter

Sukesh Chandrasekhar Letter

ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Scam)లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ను ఈడీ (ED) అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈమె రిమాండ్ లో ఉంది. ఈ నెల 23 వరకు ఈమెను రిమాండ్ కు తరలించడం తో ఈడీ అధికారులు గత రెండురోజులుగా విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా..మనీలాండరింగ్ కేసు నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) కవితను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

‘లిక్కర్ కేసులో కవిత నేరం రుజువైంది. బూటకపు, రాజకీయ కేసులని ఆమె చేసిన వాదన అబద్ధమని తేలింది. నెయ్యి డబ్బాలంటూ ఆమె చెప్పిన కథలపై దర్యాప్తు జరుగుతుంది. సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో BRS రూ.వేల కోట్లు దాచింది’ అని లేఖలో పేర్కొన్నాడు. అంతే కాదు త్వరలోనే తీహార్ జైల్లో కవిత ను కలుస్తా అంటూ లేఖ లో ప్రస్తావించడం మరింత కాకరేపుతుంది. ‘మా గ్రేటెస్ట్ తీహార్ జైలుకు మీకు స్వాగతం. మీ కోసం అన్ని ఏర్పాట్లు చేసి ఉంటారు. త్వరలోనే మిమ్మల్ని ఇక్కడ కలుస్తా. కవితతో పాటు ఆమె అవినీతి సహాయకులు, సీఎం కేజీవాల్ చేసిన అక్రమాలన్నీ బయటపడతాయి. సినిమా క్లైమాక్స్కు చేరుకుంది’ అని లేఖలో పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె తనకు ఈడీ సమన్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ ను కవిత ఉపసంహరించుకున్నారు. గత ఏడాది మార్చి 14న కవిత రిట్ పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టులో ఈరోజు వాదనల సందర్భంగా కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి తన వాదనలను వినిపిస్తూ… రిట్ పిటిషన్ పై విచారణ అవసరం లేనందున పిటిషన్ ను వెనక్కి తీసుకుంటున్నామని తెలిపారు. దీంతో, పిటిషన్ ను వెనక్కి తీసుకునేందుకు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం అంగీకరించింది. మరోవైపు, కవితను ఈడీ అరెస్ట్ చేయడం అక్రమమంటూ దాఖలైన మరో పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమయింది.

Read Also : Telangana Governor : తెలంగాణకు కొత్త గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌‌