Site icon HashtagU Telugu

Chintamaneni : కోడిపందెం వెనుక పెద్ద స్కెచ్

Chintamaneni Cock Fights

Chintamaneni Cock Fights

మాజీ ఎమ్మెల్మే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ కోడిపందెం వ్య‌వ‌హారం మ‌లుపులు తిరుగుతోంది. ఆయ‌న్ను అరెస్ట్ చేయ‌డానికి తెలంగాణ పోలీసులు ప్ర‌త్యేక బృందాల‌తో గాలిస్తున్నారు. ఆ సంద‌ర్భంగా ప‌టాన్ చెరువు కేంద్రంగా జ‌రిగిన కోడిపందెం వ్య‌వ‌హారంపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఉన్న‌ది ఉన్న‌ట్టు చెప్పే ప్ర‌భాక‌ర్ ప‌టాన్ చెరువు కోడిపందెం వ‌ద్ద‌కు వెళ్లింది నిజ‌మేన‌ని అంగీక‌రించారు. అంతేకాదు, కోడిపందెం త‌న వ్య‌స‌నం అంటూ వెల్ల‌డించారు. ఆ విష‌యాన్ని తెలుసుకున్న ప్ర‌త్య‌ర్థులు కోడి పందేలు ఆడుతాననే విషయం రెండు రాష్ట్రాల ప్రజలకు, మీడియాకు, పోలీసులకు తెలుసని ఆయన చెప్పారు.

కోడిపందేల కోసం తాను కర్ణాటకకు, పటాన్ చెరుకు వెళ్లింది నిజమేనని చెప్పారు. అయితే కోడిపందేలు చట్టం దృష్టిలో నేరం కాబట్టి పోలీసులు వస్తున్నారని సమాచారం అందగానే అక్కడి నుంచి క్షేమంగా తప్పుకున్నానని వివ‌ర‌ణ ఇచ్చారు. చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించాల్సిన బాధ్యత తనపై ఉన్నప్పటికీ, బలహీనతను చంపుకోలేక అక్కడకు వెళ్లానని చింతమనేని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. పోలీసులు వచ్చే సమయానికి తాను అక్కడ లేనని, అంతకు ముందు తీసిన ఫొటోలను, వీడియోలను మీడియాకు పోలీసులు లీక్ చేశారని అన్నారు. కోడిపందేలను నిర్వహిస్తూ తన కుటుంబాన్ని పోషించుకోవాల్సిన అవసరం తనకు లేదని వివ‌రించారు.

కర్ణాటకలో కోడిపందేలకు వెళ్లి వస్తుండగా, భోజనానికి పిలిచారని తనను ఇరికించడానికి ఇంత పెద్ద స్కెచ్ వేశారని చింతమనేని చెబుతున్నారుర‌. అయితే దొరకకుండా వ్యూహాత్మ‌కంగా త‌ప్పుకున్నాని చెప్పారు. ఈ కేసులో నిందితులకు 41ఏ నోటీసులు ఇవ్వాలని పోలీసులకు కోర్టు చివాట్లు పెట్టిందని చెప్పారు. పటాన్ చెరులో జరిగిన కోడిపందేల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారనే వార్త సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి చింతమనేని పారిపోయారని, ఆయన కోసం గాలిస్తున్నామని పటాన్ చెరు డీఎస్పీ చెప్పారు. ఈ క్రమంలో చింతమనేని స్పందిస్తూ వివ‌ర‌ణ ఇచ్చారు.