Made In Hyderabad : హైదరాబాద్ అనగానే స్పెషల్ బిర్యానీ గుర్తుకు వస్తుంది. ఇదంతా పాత ముచ్చట. ఇప్పుడు చాలా రంగాల్లో హైదరాబాద్ తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతోంది. యావత్ దేశం గర్వించేలా చేస్తోంది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన వెమ్ టెక్నాలజీస్ కంపెనీ స్టెల్త్ టెక్నాలజీతో కూడిన అధునాతన యుద్ధ విమానాన్ని తయారు చేసింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్’ (డీఆర్‌డీఓ)తో కలిసి ఈ ఫైటర్ జెట్‌ను రూపొందించింది. దీనికి ‘అడ్వాన్స్‌డ్ మీడియం కంబ్యాట్ ఎయిర్‌క్రాఫ్ట్’ (ఏఎంసీఏ) అని పేరు పెట్టారు.
Also Read :YouTuber Vs SEBI: రూ.104 కోట్లు సంపాదించిన యూట్యూబర్.. ‘సెబీ’ బ్యాన్
ఈరోజు ‘ఏరో ఇండియా’లో ఫైటర్ జెట్ ప్రదర్శన
దీనికి సంబంధించిన కొత్త అప్‌డేట్ ఏమిటంటే.. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఎయిర్ షో ‘ఏరో ఇండియా’ 15వ ఎడిషన్ ఈరోజు (ఫిబ్రవరి 10) నుంచి ఫిబ్రవరి 14 వరకు బెంగళూరులో జరుగుతుంది. ఆ నగరంలోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఈ ఎయిర్‌షోకు వేదికగా నిలువనుంది. మన హైదరాబాద్‌లో వెమ్ టెక్నాలజీస్ తయారుచేసిన ఏఎంసీఏ స్టెల్త్ యుద్ధ విమానాన్ని ఈ ఎయిర్ షోలో ప్రదర్శిస్తారు.
Also Read :Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం.. సీబీఐ అదుపులో నలుగురు!
ఏఎంసీఏ ఫైటర్ జెట్ గురించి..
- ఏఎంసీఏ యుద్ధ విమానం డిజైన్‌ను బెంగళూరులోని డీఆర్‌డీవో-ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఏడీఏ) రూపొందించగా, హైదరాబాద్‌కు చెందిన వేమ్ టెక్నాలజీస్ ఫ్యాబ్రికేషన్ పనులు చేసింది.
- ఈ విమానంలోని కీలక మాడ్యూల్స్ అన్నీ వెమ్ టెక్నాలజీస్ తయారుచేసి, మొత్తం విమానాన్ని హైదరాబాద్‌లోనే(Made In Hyderabad) అసెంబుల్ చేసింది.
- ఈ ఫైటర్ జెట్‌లో ఏఐ ఆధారిత ఎలక్ట్రానిక్ పైలట్, నెట్ ఆధారిత ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి.
- శత్రు లక్ష్యాన్ని గుర్తించే విషయంలో స్వతంత్రంగా పనిచేస్తుంది.
- దీని బరువు 25 టన్నులు.
- మానవ రహితంగా కూడా ఏఎంసీఏ యుద్ధ విమానం పనిచేయగలదు.
- వెమ్ టెక్నాలజీస్ తేజస్ యుద్ధ విమానానికి సంబంధించి మధ్యభాగాన్ని కూడా తయారు చేస్తోంది.
- యుద్ధ విమానాల ఫ్యుసిలేజ్‌లు,జనరేటర్ల తయారీలో వెమ్ టెక్నాలజీస్‌కు మంచి పేరుంది.
- భారత సైన్యానికి చెందిన యుద్ధ విమానాలు, హెలికాప్టర్లకు అవసరమైన ఆన్ బోర్డ్ సిస్టమ్‌లను వెమ్ టెక్నాలజీస్ తయారు చేసి సప్లై చేస్తుంటుంది.
- ఇటీవలే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ‘అసీబల్’ను వెమ్ టెక్నాలజీస్ డెవలప్ చేసింది.
30 దేశాల రక్షణ మంత్రులు, 43 దేశాల వైమానిక దళాధిపతులు
ఈసారి బెంగళూరులో జరుగుతున్న ‘ఏరో ఇండియా’ ఎయిర్ షోలో రష్యాకు చెందిన ఎస్‌యూ–57 యుద్ధ విమానం, అమెరికాకు చెందిన ఎఫ్–35 లైట్నింగ్ 2 యుద్ధ విమానం ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. 150 విదేశీ కంపెనీలు సహా మొత్తం 900 మంది ఎగ్జిబిటర్లు ఈ కార్యక్రమంలో భాగం అవుతున్నారు. ఈసారి ‘ది రన్ వే టు ఎ బిలియన్ అపార్చునిటీస్’అనే థీమ్‌తో ఎయిర్ షో నిర్వహిస్తున్నారు. 30 దేశాల రక్షణ మంత్రులు, వారి ప్రతినిధులు, 43 దేశాల నుంచి వైమానిక దళాధిపతులు, కార్యదర్శులు దీనికి హాజరవుతున్నారు.