Srirama Yatra : రామ‌రామా, శోభాయాత్ర‌కు రాజాసింగ్ రంగు

ప్ర‌తి ఏడాది శ్రీరామ న‌వమి సంద‌ర్భంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో జ‌రిగే శోభాయాత్రకు (Srirama Yatra) ఈసారి రాజ‌కీయ రంగు ప‌డ‌నుంది.

  • Written By:
  • Updated On - March 28, 2023 / 03:35 PM IST

ప్ర‌తి ఏడాది శ్రీరామ న‌వమి సంద‌ర్భంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో జ‌రిగే శోభాయాత్రకు (Srirama Yatra) ఈసారి రాజ‌కీయ రంగు ప‌డ‌నుంది. ఎందుకంటే, దానికి ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh) నాయ‌క‌త్వం వ‌హిస్తూ వెల్ల‌డించ‌డం ఒక కార‌ణంగా క‌నిపిస్తోంది. శ్రీరామ న‌వమి శోభాయాత్ర‌ను ఈ ఏడాది కూడా ఎమ్మెల్యే రాజాసింగ్ లీడ్ చేయ‌బోతున్నారు. గ‌త ఏడాది శోభాయాత్ర సంద‌ర్భంగా హిందూ, ముస్లింల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు సృష్టించేలా ప్ర‌సంగించార‌ని పోలీసులు కేసు న‌మోదు చేసి, జైలుకు పంపారు. ఆ త‌రువాత బీజేపీ కూడా ఆయ‌న్ను స‌స్సెండ్ చేసింది. ముస్లింల దుకాణాల్లో హిందువులు కొనుగోలు చేయ‌కూడ‌ద‌ని ఆయ‌న అప్ప‌ట్లో పిలుపునిచ్చారు. అంతేకాదు, హిందూవురు తిర‌గ‌బ‌డితే, ముస్లింలు ఎవ‌రూ మిగ‌ల‌రంటూ రెచ్చ‌గొట్టే ప్ర‌సంగం చేశారు. దీంతో పోలీసులు ఎంట్రీ ఇవ్వ‌డం, జైలుకు పంప‌డం జ‌రిగింది. దీంతో అప్ప‌ట్లో మ‌త ఘ‌ర్ష‌ణ‌ల‌కు తావులేకుండా వివాదం స‌ద్దుమ‌ణిగింది.

 హైద‌రాబాద్ న‌గ‌రంలో జ‌రిగే శోభాయాత్రకు..(Srirama Yatra).

ప్ర‌తి ఏడాది హైద‌రాబాద్ న‌గ‌రంలో జ‌రిగే శోభాయాత్రకు(Srirama Yatra) ఈసారి బీజేపీ బ‌హిష్క‌రించిన ఎమ్మెల్యే రాజాసింగ్(Rajasingh) నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఈనెల 30వ తేదీన‌ శోభా యాత్ర జ‌ర‌గ‌నుంది. ఆ రోజు ఉదయం 10:11 గంటలకు మంగళ హాట్ మార్కెట్ వద్ద ఉన్న ఆకాశపురి హనుమాన్ ఆల‌యం వ‌ద్ద శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఆ మేర‌కు షెడ్యూల్ ను రాజాసింగ్ వెల్ల‌డించారు. అయితే, యాత్రకు ఇప్ప‌టి వ‌ర‌కు పోలీసులు ఇంకా అనుమతి ఇవ్వలేదు.

Also Read : RajaSingh: దేవిశ్రీ ప్రసాద్ కి వార్నింగ్ ఇచ్చిన రాజాసింగ్

గత ఏడాది శోభాయాత్ర (Srirama Yatra)మంగళ్‌హాట్‌లోని సీతారాంబాగ్ ఆలయం నుంచి ప్రారంభమైంది. గోషామహల్ , సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌ల పరిధిలోని వివిధ ప్రాంతాల మీదుగా సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయంశాల పాఠశాలకు చేరుకుంది. ఆకాశపురి హనుమాన్ దేవాలయం నుంచి ప్రారంభమై గంగాబౌలి జంక్షన్ వద్ద ప్రధాన ఊరేగింపులో చేరింది. ఈ మార్గంలో పలుచోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆ సంద‌ర్భంగా గతేడాది రామనవమి ర్యాలీలో రాజా సింగ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. రెచ్చగొట్టే విధంగా మాట్లాడినందుకు రాజా సింగ్‌పై(Rajasingh) షాహినాయత్‌గంజ్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసింది.

ప్ర‌తి ఏడాది రంజాన్, శ్రీరామ న‌వమి న‌వ‌రాత్రులు

ప్ర‌తి ఏడాది రంజాన్, శ్రీరామ న‌వమి(Srirama Yatra) న‌వ‌రాత్రులు ఇంచుమించు ఒకేసారి వ‌స్తాయి. గ‌త ఏడాది రంజాన్ సందర్భంగా ఓల్డ్ సిటీలో హిందూ విక్రేతలను బహిష్కరించినట్లు వ‌చ్చిన ఆరోపణ‌ల‌పై రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. “హిందువులు కూడా ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటే, వారి వ్యాపారం అయిపోతుంది. హిందువులు పేదలకు భిక్ష కూడా ఇస్తారు క‌నుక అడుక్కునే స్థితిలో కూడా ఉండరు అంటూ వ్యాఖ్యానించారు. “హిందువులు మేల్కొంటే ముస్లింలందరూ ఉండ‌రు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇలా విద్వేషపూరిత ప్రసంగం చేసిన కేసులో ఎమ్మెల్యేకు ఆగస్టులో పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Also Read : Book Ban: స‌ల్మాన్ ఖుర్షీద్ పుస్త‌కంపై వివాదం, అమిత్‌షాకు రాజాసింగ్ ఘాటు లేఖ‌

హిందూవాదిగా పేరున్న రాజాసింగ్(Rajasingh) తొలుత 2009 నుంచి 2013 వ‌ర‌కు తెలుగుదేశం పార్టీలో ప‌నిచేశారు. ఆ త‌రువాత2014 నుంచి బీజేపీలో చేరిన రాజా సింగ్ వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జాతీయ స్థాయిలో హిందుత్వ నాయకుడిగా గుర్తింపును బలోపేతం చేయడానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. దేశంలో అభిమానులను పెంచుకోవడానికి చాలా కాలం క్రితం శ్రీరామ్ యువ సేనను ప్రారంభించాడు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో 100కి పైగా అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ డిపాజిట్లు కోల్పోయింది. కానీ, రాజాసింగ్ మాత్రం గెలిచారు. బీజేపీకి ఏకైక ఎమ్మెల్యేగా ఎదగడానికి ఆయన రాజీలేని హిందుత్వ స్టాండ్ సహాయపడింది.

రాజాసింగ్ నాయ‌క‌త్వంలో  శోభాయాత్ర‌

రాజా సింగ్(Rajasingh) గతంలో పలు వివాదాల్లో చిక్కుకున్నారు. గత సంవత్సరం, అతను ప్రవక్త మహమ్మద్‌పై కించపరిచే వ్యాఖ్యలు చేయడంతో అతన్ని అరెస్టు చేశారు. ఆగస్టు 20న మాదాపూర్‌లో హైదరాబాద్‌లో హాస్యనటుడు మునావర్ ఫరూఖీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రతీకారంగా ఈ పని చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో రాజాసింగ్ నాయ‌క‌త్వంలో ఈనెల 30వ తేదీన జ‌రిగే శోభాయాత్ర‌కు (Sriram Yatra)పోలీసులు అనుమతి ఇచ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్నాయి. దీంతో ఈ అంశం ఈసారి రాజ‌కీయ రంగు పులుముకోనుంది.

Also Read : రాజాసింగ్ వ‌ర్సెస్ కేటీఆర్‌.. కాక‌రేపుతున్న ట్విట్ట‌ర్ వార్‌