Site icon HashtagU Telugu

Sridhar Babu : ఓడిన కూడా బీఆర్ఎస్ నేతల్లో మార్పు రావడం లేదు – మంత్రి శ్రీధర్ బాబు

35,000 Crore Investments

35,000 Crore Investments

ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ నేతల్లో ఎలాంటి మార్పు రావడం లేదని, ఇంకా వారిలో నియంతృత్వ ధోరణే స్పష్టంగా కనిపిస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు (Minister Sridhar Babu) అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో షాక్ తిన్న..బిఆర్ఎస్ (BRS) , ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే షాక్ తినబోతుందని..అది వారికీ అర్థమై..కాంగ్రెస్ ఫై తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

3550 రోజుల పాటు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 35 రోజులు కూడా కాలేదని అప్పుడే తామిచ్చిన హామీలపై బీఆర్ఎస్ నేతలు కామెంట్లు చేయడం సరికాదన్నారు. ఇప్పటికే ఇచ్చిన ఆరు హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ లోపే ఎందుకు బీఆర్ఎస్ నేతలు ఎందుకు గగ్గోలు పెడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రజల తీర్పును బాధ్యత రహిత్యంగా చేశారు. ఆరున్నర కోట్ల మంది మహిళలకు ఆర్టీసీలో ఉచిత సేవలు (Free Bus) అందుతున్నాయి. కాంగ్రెస్ హామీలపై ఒక బుక్ రిలీజ్ చేశారు. పాలన మొదలై 20 రోజులు కాకుండానే అప్పుడే గగ్గోలు పెడుతున్నారు. ఓడినా తరువాత కూడా బీఆర్ఎస్ నేతల్లో మార్పు రావడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్ ప్రారంభించడం.. వేలాది మంది ప్రజా దర్బార్ కి రావడం చూస్తేనే అర్థం అవుతుంది. పదేళ్ల నుంచి ప్రజల సమస్యలు ఎలా ఉన్నాయో..? అని శ్రీధర్ అన్నారు.

బీఆర్ఎస్ (BRS) భవన్ లో ఉండి ప్రెస్ మీట్ పెట్టడం కాదు ఒక్కసారి గ్రామంలోకి వెళ్లి అక్కచెల్లెళ్ళని అడగండి..వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో. ప్రజా పాలన ఎలా ఉందో ఉంటుందో కళ్ళారా చూస్తూనే ఉన్నారు కాదా. ప్రజా దర్బార్ పెట్టి వేలాది మంది వచ్చి విజ్ఞప్తులు చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్కసారైనా మీరు ప్రజలను కలిశారా వాళ్ల గోస విన్నారా? లేదు అందుకే మీ అహంకార పూరిత పాలనకు చరమగీతం పాడారు. అయినా ఇంకా మారకుండా అర్థం లేని ఆరోపణ చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. కొంతమంది ఆటో డ్రైవర్ లను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ కి మహిళలకు ఉచిత బస్ సౌకర్యం వద్దు అని భావిస్తున్నారా? ఓపెన్ చెప్పాలి అంతేగాని రాజకీయాల కోసం ఆటో డ్రైవర్స్ ను బలి చెయ్యొద్దు. వారికి న్యాయం చేసే కార్యాచరణ రూపొందిస్తున్నాం’’ అని క్లారిటీ ఇచ్చారు.

Read Also : Mallareddy : మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ కోరుతున్న మల్లారెడ్డి..కేసీఆర్ ఇస్తాడా..?

Exit mobile version