Spicejet : టేకాఫ్‌కు ముందే పెద్ద షాక్.. స్పైస్‌జెట్ ఎస్‌జీ-2138 సర్వీస్ రద్దు..!

Spicejet : ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలు విమాన ప్రయాణాలపై ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొన్ని వారాలుగా దేశవ్యాప్తంగా పలు విమాన సర్వీసుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రయాణికుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Spicejet

Spicejet

Spicejet : ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలు విమాన ప్రయాణాలపై ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొన్ని వారాలుగా దేశవ్యాప్తంగా పలు విమాన సర్వీసుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రయాణికుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అహ్మదాబాద్‌ ఎయిర్ ఇండియా ఘటన మరువక ముందే మరో సంఘటన తాజాగా వార్తల్లో నిలిచింది.

శంషాబాద్‌ – తిరుపతి విమానం నిలిచిపోయింది
శంషాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లాల్సిన స్పైస్‌జెట్‌ (SpiceJet) ఎస్‌జీ-2138 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. బయల్దేరడానికి క్షణాల ముందు పైలట్‌ రొటీన్‌ చెకింగ్‌ చేస్తుండగా టెక్నికల్‌ ఇష్యూస్‌ను గుర్తించి వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఈ లోపం కారణంగా విమాన సర్వీసును నిలిపివేయడంతోపాటు పూర్తిగా రద్దు చేశారు. సంస్థ ఇంజనీరింగ్ టీమ్ సమస్యను పరిష్కరించడానికి తక్షణమే ప్రయత్నాలు ప్రారంభించింది.

AP Liquor Case : ఛార్జ్ షీట్ లో జగన్ పేరు..ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేయొచ్చా..?

ప్రయాణికుల ఆందోళన
ఈ ఘటనతో విమానంలో ప్రయాణించేందుకు సిద్ధంగా ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. సర్వీస్‌ రద్దు కావడంతో కొంతమంది తమ షెడ్యూల్‌ మార్చుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే గత కొన్ని రోజుల్లో పలు విమానాలు మధ్యలోనే సాంకేతిక సమస్యలతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేయడం, ఇలాంటి ఘటనలు వరుసగా జరగడం ప్రయాణికుల్లో భయం పెంచుతోంది.

విమానయాన సంస్థలపై విమర్శలు
సాంకేతిక లోపాలు పెరుగుతున్న తరుణంలో విమానయాన సంస్థలు సరైన నాణ్యతా ప్రమాణాలను పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రయాణికుల ప్రాణ భద్రతపై ఎయిర్‌లైన్స్ మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని అభ్యర్థనలు వినిపిస్తున్నాయి. నిపుణులు కూడా ఇలాంటి లోపాలను తక్షణమే గుర్తించి, తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Protein : నాన్​వెజ్ తినేవారికే కాదు.. వెజ్ తినేవారికి కూడా అధిక ప్రోటీన్..అవేంటో.. చూసేద్దాం.!.

  Last Updated: 20 Jul 2025, 10:34 AM IST