Site icon HashtagU Telugu

Telangana Elections : ప్రచారం కోసం బండి సంజయ్‌కి ప్రత్యేక హెలికాప్టర్..?

Special Helicopter To Bandi

Special Helicopter To Bandi

తెలంగాణ లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న ఇంకా పూర్తి స్థాయిలో బిజెపి (BJP) ప్రచారం మొదలుపెట్టకపోయేసరికి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క అధికార పార్టీ తో పాటు కాంగ్రెస్ పార్టీ లు పోటా పోటీగా ప్రచారం చేస్తూ ఉంటె..బిజెపి మాత్రం సైలెంట్ గా ఉండడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో బిజెపి ఈ నెల 07 నుండి ప్రచారాన్ని ముమ్మరం చేసేలా ప్లాన్ చేసింది.

ఈ నెల 07 హైదరాబాద్ లో బీసీ ఆత్మ గౌరవ సభ (BC Atma Gourava Sabha) లో ప్రధాని మోడీ(PM Modi) పాల్గొననున్నారు. అలాగే 11వ తేదీన నిర్వహించే సభలోనూ ఆయన పాల్గొంటారు. ఈ తేదీల్లో హైదరాబాద్, కరీంనగర్, అదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో సభలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అలాగే నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక ఈ నెల 15వ తేదీ నుంచి జోరుగా ప్రచారం చేయాలని బీజేపీ నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా సహా కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు ప్రచారంలో పాల్గొనన్నునారు. 15వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ఉధృతమయ్యాక 19న మరోసారి ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నారు.

ఇక తెలంగాణవ్యాప్తంగా రాష్ట్ర నేతలు జోరుగా ప్రచారం చేసేందుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ (Bandi Sanjay)కి ప్రత్యేక హెలికాప్టర్ (Special Helicopter) ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌లకు ముగ్గురికి… మరో రెండు హెలికాప్టర్లు ఇవ్వనున్నారని అంటున్నారు. బండి సంజయ్‌‌కి పూర్తిగా ఒక హెలికాప్టర్ కేటాయించగా, మిగిలిన ముగ్గురు నాయకులకు రెండు హెలికాప్టర్ లను ప్రచారం కోసం కేటాయించనున్నారని సమాచారం.

ఇక కొద్దీ సేపటి క్రితం మూడో విడుత అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించారు.

అభ్యధుల జాబితా చూస్తే..

  1. మంచిర్యాల – వీరబెల్లి రఘునాథ్
  2. ఆసిఫాబాద్ (ఎస్టీ) – అజ్మీరా అత్మారామ్ నాయక్
  3. బోధన్ – వడ్డి మోహన్ రెడ్డి
  4. బాన్సువాడ – ఈ. లక్ష్మీనారాయణ
  5. నిజామాబాద్ రూరల్ – దినేశ్ కులచారి
  6. మంథని – చందుపట్ల సునీల్ రెడ్డి
  7. మెదక్ – పంజా విజయకుమారి
  8. నారాయణఖేడ్ – జాన్వాదే సంగప్ప
  9. ఆంధోల్ (ఎస్సీ) – బాబూ మోహన్
  10. జహీరాబాద్ (ఎస్సీ) – రామచంద్ర రాజ నర్సింహ
  11. ఉప్పల్ – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
  12. ఎల్బీనగర్ – సామ రంగారెడ్డి
  13. రాజేంద్రనగర్ – తోకల శ్రీనివాస్ రెడ్డి
  14. చేవెళ్ల (ఎస్సీ) – కే.ఎస్. రత్నం
  15. పరిగి – భూనేటి మారుతి కిరణ్
  16. ముషీరాబాద్ – పూస రాజు
  17. మలక్ పేట్ – సామరెడ్డి సురేందర్ రెడ్డి
  18. అంబర్ పేట్ – కృష్ణా యాదవ్
  19. జూబ్లీహిల్స్ – లంకల దీపక్ రెడ్డి
  20. సనత్ నగర్ – మర్రి శశిధర్ రెడ్డి
  21. సికింద్రాబాద్ – మేకల సారంగపాణి
  22. నారాయణపేట్ – రతంగ్ పాండురెడ్డి
  23. జడ్చర్ల – చిత్తరంజన్ దాస్
  24. మక్తల్ – జలందర్ రెడ్డి
  25. వనపర్తి – అశ్వద్దామరెడ్డి
  26. అచ్చంపేట్ (ఎస్సీ) – దేవని సతీష్ మాదిగ
  27. షాద్ నగర్ – అందె బాబయ్య
  28. దేవరకొండ (ఎస్టీ) కేతావత్ బాలూనాయక్
  29. హుజూర్ నగర్ – చెల్లా శ్రీలతా రెడ్డి
  30. నల్గొండ – మాదగాని శ్రీనివాస్ గౌడ్
  31. ఆలేరు – కొండాలి శ్రీనివాస్
  32. పరకాల – డాక్టర్ కాళీ ప్రసాద్ రావు
  33. పినపాక (ఎస్టీ) – పోడియం బాలరాజు
  34. పాలేరు – నున్నా రవికుమార్
  35. సత్తుపల్లి (ఎస్సీ) – రామలింగేశ్వరరావు

Read Also : BC Atma Gourava Sabha : ఈ నెల 07 న హైదరాబాద్ లో బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభ..