Site icon HashtagU Telugu

Hyderabad: ఐపీఎల్‌ మ్యాచ్‌లు.. ఉప్పల్‌ స్టేడియానికి ప్రత్యేక బస్సులు

Special buses to Uppal Stadium for IPL matches

Special buses to Uppal Stadium for IPL matches

Hyderabad: టీజీఎస్‌ ఆర్టీసీ ఉప్పల్‌ స్టేడియంలో జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌లు తిలకించే ప్రత్యేక బస్‌ సర్వీసులు ఏర్పాటు చేస్తోంది. ఉప్పల్ స్టేడియంలో మార్చి 27, ఏప్రిల్ 6, 12, 23, మే 5, 10, 20, 21 తేదీల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రధానంగా ఘట్‌కేసర్, హయత్‌నగర్‌, ఎన్జీవోస్ కాలనీ, ఎల్బీనగర్, కోఠి, లక్డీకాపూల్‌, దిల్‌సుఖ్‌నగర్‌, మేడ్చల్, కేపీహెచ్‌బీ, మియాపూర్, జేబీఎస్, ఈసీఐఎల్, బోయిన్‌పల్లి, చార్మినార్, చాంద్రాయణగుట్ట, మెహదీపట్నం, బీహెచ్ఈఎల్ వంటి వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియం వరకు ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడపనుంది. ఇక, మ్యాచ్‌ చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్‌ స్టేడియానికి వచ్చేందుకు గ్రేటర్ పరిధిలోని 24 డిపోల నుంచి 60 ప్రత్యేక బస్సులను ఆపరేట్ చేయనుంది. ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరగనున్న తేదీల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

Read Also: Online Betting : రాష్ట్రాలు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ పై చట్టాలు చేయొచ్చ: కేంద్రం

ఐపీఎల్ కు వచ్చే ఫ్యాన్స్ కి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ బస్సులను పలు హైదరాబాద్ లోని ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి ఆపరేట్ చేయనున్నట్టు వెల్లడించారు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ అధికారులు. గ్రేటర్ పరిధిలోని 24 డిపోల నుంచి 60 స్పెషల్ బస్సులను ఆపరేట్ చేయనున్నారు. ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్న తేదీల్లో ఈ ప్రత్యేక బస్ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. కాగా, మన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఉందంటే ఫ్యాన్స్ హంగామా అంతా ఇంతా కాదు. స్టేడియానికి వెళ్లి మరీ మ్యాచ్ చూసి ఎంజాయ్ చేస్తారు. దీంతో మ్యాచ్ రోజున హైదరాబాద్ భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ ట్రాఫిక్ ను ఉద్దేశించి తెలంగాణ ఆర్టీసీఈ నిర్ణయం తీసుకుంది. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ లకోసం హైదరాబాద్ లో స్పెషల్ బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. మొత్తం 24 రూట్లలో ఈ బస్సులు నడవనున్నాయి.

Read Also: State Food Lab : ఏపీలో అందుబాటులోకి రాబోతున్న స్టేట్ ఫుడ్ ల్యాబ్