Site icon HashtagU Telugu

Trains Cancelled : 8 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

General Ticket Rule

General Ticket Rule

Trains Cancelled : దక్షిణ మధ్య రైల్వే 8 రైళ్లను రద్దు చేసింది. హసన్‌పర్తి – ఉప్పల్ రైల్వేస్టేషన్ల మధ్య పనుల కారణంగా 8 రైళ్లను క్యాన్సల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో కాజీపేట- హసన్‌పర్తి, బల్లార్ష-కాజీపేట, కరీంనగర్-సిర్పూర్, సిర్పూర్-కరీంనగర్ మధ్య రైళ్లు రద్దయ్యాయి. ఈనెల 19 నుంచి జనవరి 13 వరకు ఈ ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యాయి. బోధన్- కరీంనగర్ రైలు ఈనెల 20 నుంచి జనవరి 14 వరకు రద్దయింది. కరీంనగర్- బోధన్ రైలు ఈనెల 19 నుంచి జనవరి 13 వరకు క్యాన్సిల్ అయింది. సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్‌నగర్, సిర్పూర్ కాగజ్‌నగర్- సికింద్రాబాద్ రైళ్లు జనవరి 2 నుంచి 13వ తేదీ వరకు(Trains Cancelled) రద్దయ్యాయి. ఆయా రూట్లలో ప్రయాణించేవారు క్యాన్సల్ అయిన ట్రైన్స్‌ను దృష్టిలో ఉంచుకొని జర్నీని ప్లాన్ చేసుకోవాలి. కాగా, దక్షిణ మధ్య రైల్వేకు చెందిన 11 మంది ఉద్యోగులకు “మ్యాన్ ఆఫ్ ది మంత్” భద్రతా అవార్డులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్  అరుణ్ కుమార్ జైన్ అందజేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రయాణికుల రద్దీకి ప్రస్తుతమున్న రైళ్లు సరిపోవడం లేదు. అందుకే ప్రయాణానికి ముందస్తుగా టికెట్లను బుక్‌ చేసుకుంటుంటారు. అత్యవసర సమయాల్లో వెళ్లేందుకు తత్కాల్‌ అందుబాటులో ఉన్నా..  దానికీ డిమాండ్‌ ఎక్కువగానే ఉంది. అదే సమయంలో భారీగా వెయిటింగ్ ఉంటోంది. దీంతో చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు.ఇక ఈ వెయిటింగ్‌ లిస్ట్‌కు మంగళం పాడేందుకు భారత రైల్వే ప్రణాళిక రచిస్తోంది. రూ.లక్ష కోట్లు ఖర్చుతో భారీగా రైళ్లను కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఓ జాతీయ వార్త సంస్థకు తెలిపారు. ప్రస్తుతం ఉన్న పాత రైళ్ల స్థానంలో 7వేల నుంచి 8వేల కొత్త రైళ్లను కొనేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

Also Read: Volcano Video : బద్దలైన అగ్నిపర్వతం.. లావా ఎలా ఎగిసిపడిందో చూడండి