BRS MLAs : రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. త్వరలోనే ముగ్గురు, నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా హస్తం పార్టీకి జై కొడతారని తెలుస్తోంది. కొత్తగా కాంగ్రెస్‌లో చేరబోయే వారిలో గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన ఒకరిద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసిన ఇద్దరు మాజీ మంత్రులకు ఏకంగా మంత్రి పదవులను ఆఫర్ చేశారనే టాక్ వినిపిస్తోంది.
Also Read :Road Tax Hike : త్వరలోనే పెట్రోల్, డీజిల్ వాహనాల ‘రోడ్ ట్యాక్స్’ పెంపు
బీఆర్ఎస్‌కు చెందిన ఆ ఇద్దరు మాజీ మంత్రుల్లో ఒకరికి విద్యాసంస్థలు ఉన్నాయని తెలిసింది. వాటికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురుకాకుండా కాపాడుకునేందుకు ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారట. సదరు మాజీ మంత్రిపై ఒక భూకబ్జా కేసు కూడా ఉందట. ఇక గొర్రెల పంపిణీ స్కీమ్‌లో అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలను ఎదుర్కొంటున్న మరో మాజీ మంత్రి కూడా కాంగ్రెస్‌లో చేరబోతున్నారట. ఈవిధంగా బీఆర్ఎస్ నుంచి చేరికలను కొనసాగించడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సీఎం రేవంత్ టార్గెట్‌గా పెట్టుకున్నారు.
Also Read :Naga Chaitanya : నా జీవితంలో ఏర్పడిన ఖాళీని తను నింపుతుంది.. శోభితతో పెళ్లిపై నాగచైతన్య..
తమ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ అయిన ఎమ్మెల్యేలపై గతంలో బీఆర్ఎస్(BRS MLAs) పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఈవిషయంలో స్పీకర్‌దే తుది నిర్ణయం అని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ పరిణామంతో మరింత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యేందుకు తలుపులు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకోవాలని యోచనతోనూ కాంగ్రెస్ ఉందని అంటున్నారు.