తెలంగాణ కాంగ్రెస్ వరుసగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ప్రియాంకగాంధీ చేత యూత్ డిక్లరేషన్ ప్రకటన చేయించి ఇతర పార్టీలకు సవాల్ విసిరింది. అయితే ప్రియాంక గాంధీ తర్వాత కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ హైదరాబాద్ కు రానున్నారు. బోయిన్ పల్లిలో నిర్మించే గాంధీ ఐడియాలజీ సెంటర్ భవన నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేస్తారు. ఈ భవన నిర్మాణానికి వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి పది ఎకరాల స్థలాన్ని కేటాయించారు.
ఇపుడు అదేస్థలంలో గాంధీ ఐడియాలజీ సెంటర్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సెంటర్ నిర్మాణానికి కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కూడా అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో నిర్మాణ పనులను ప్రారంభించాలని పీసీసీ నిర్ణయించింది. ఈ భవనంలో గాంధీ భావజాలాన్ని తెలిపే లైబ్రరీతో పాటు పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలను వీక్షించేలా ఒక థియేటర్, గాంధీ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నగరానికి వచ్చినపుడు అక్కడ బస చేసేలా ఏర్పాట్లు ఉంటాయి. త్వరలో ఈ భవనం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సోనియాతో పాటు రాహుల్, ఖర్గే ఇతర ముఖ్యనేతలు హాజరయ్యే అవకాశాలున్నాయి.
Also Read: Turtle Video: తాబేలు దాహం తీర్చిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా!