Site icon HashtagU Telugu

Hyderabad UT Debate : హైదరాబాద్ ‘యూటీ’.. సోషల్ మీడియాలో వదంతులతో అనాలిసిస్

Hyderabad Steel Bridge

Hyderabad Steel Bridge

Hyderabad UT Debate : సోషల్ మీడియాలో రకరకాల అంశాలపై నెటిజన్స్ మధ్య డిస్కషన్ నడుస్తుంటుంది. ఇప్పుడు హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం (యూటీ)గా చేస్తారనే దానిపై చర్చ నడుస్తోంది. దీనిపై కేంద్ర సర్కారు నుంచి ఎలాంటి సంకేతాలు లేకున్నా.. సోషల్ డిబేట్ మాత్రం వాడివేడిగా సాగుతోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై కేంద్ర సర్కారు ప్రకటన చేసినప్పటి నుంచి ఈ ప్రచారం ఊపందుకుంది. హైదరాబాద్ ఒక్కటే కాదు.. దీంతోపాటు ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలను యూటీలుగా ప్రకటిస్తారని నెటిజన్స్ ఒకరికొకరు వదంతులను చెప్పుకుంటున్నారు. తమకు తోచిన విధంగా దీనిపై  స్టోరీస్ ను అల్లుతున్నారు. ఈ డిస్కషన్ ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం..

Also read : World Car Free Day 2023: నేడు వరల్డ్ కార్ ఫ్రీ డే ..అంటే ఏంటో..? ఎందుకు పిలుస్తారో తెలుసుకోండి

2024 జూన్ నుంచి..

‘‘కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయనుంది. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడనుంది. ఇప్పటికే కిషన్ రెడ్డి రంగంలోకి దిగి కంటోన్మెంట్ అధికారులతో మాట్లాడారు. 2024 జూన్ నుంచి హైదరాబాద్ యూటీగా మారే ఛాన్స్ ఉంది’’ అని సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా డిస్కషన్ జరుగుతోంది. నిజాం స్టేట్ 1948 సెప్టెంబర్ 17న దేశంలో విలీనమైంది. ఆ తేదీన హైదరాబాద్‌ను యూటీగా ప్రకటిస్తారంటూ.. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటారు. ఈసారి ఆవిధమైన ప్రచారం ఇంకొంచెం జోరుగానే సాగింది. ఇదంతా అబద్ధమే అయినా.. నిజమేనని నమ్మిన నెటిజన్స్ కూడా లేకపోలేదు.

ఉమ్మడి రాజధాని.. ఒక లాజిక్..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లకు పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ఉంటుందని  కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ గడువు 2024తో పూర్తవుతుంది. కాబట్టి అప్పుడు హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తారనే మరో లాజిక్ ను మరికొందరు తెరపైకి తెస్తున్నారు. గతంలో తెలంగాణ ఏర్పాటు సమయంలో హైదరాబాద్‌ను యూటీ చేసి తెలంగాణ ఇస్తామన్నా కేసీఆర్ ఒప్పుకున్నారని అలాంటి వారు వాదిస్తున్నారు.  ఇప్పుడు హైదరాబాద్‌ను యూటీ చేస్తానంటే కేసీఆర్ కాదని చెప్పరంటూ కొందరు నెటిజన్స్ తమదైన స్టైల్ లో వదంతుల అనాలిసిస్ చేసేస్తున్నారు. ఇక ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువైన ప్రస్తుత తరుణంలో.. హైదరాబాద్‌ను యూటీ చేసి దేశానికి రెండో రాజధాని చేస్తారనే ప్రచారం కూడా చాలా ఏళ్లుగా నడుస్తోంది. ఇలా చేయడం వల్ల హైదరాబాద్ ప్రాంతంలో బీజేపీ బలపడే ఛాన్స్ ఉంటుందని ఇంకొందరు ఆ పార్టీ సానుభూతిపరులు అభిప్రాయపడుతున్నారు.