Snake : ఏసీలో కాపురం పెట్టిన తాచుపాము..

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సదా శివుని పాలెం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది

  • Written By:
  • Publish Date - November 2, 2023 / 12:56 PM IST

ఎక్కడైనా పుట్టలోను , ఏదైనా పాడుబడ్డ ఇంట్లోనో పాములు (Snakes) నివాసం ఉంటాయి..కానీ ఇక్కడ ఓ ఇంట్లో అది కూడా ఏసీ (AC) లో కాపురం పెట్టి ..ఆ ఇంటి వాసులను పరుగులు పెట్టించింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి (Sattupally) మండలం సదా శివుని పాలెం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని గౌతమ్ రెడ్డి అనే యజమాని ఇంటిలోని ఏసి లో త్రాచు పాము దూరి నివాసం ఏర్పరుచుకుంది. గత కొద్ది రోజులుగా వాతావరణం చల్లగా ఉండటంతో ఏసి స్విచ్ ఆన్ చెయ్యడం లేదు. అయితే గత కొన్ని రోజులుగా పగలు ఉష్ణో గ్రతలు పెరిగి.. రాత్రుళ్లు చలి గా ఉంటుంది. దీంతో ఆ ఇంటి యజమాని చల్లదనం కోసం ఏసి స్విచ్ ఆన్ చేసాడు. ఆ ఏసి లో నుంచి శబ్దాలు వస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఏదో తెల్లని పొడి ఉన్న దానిని చూసిన ఇంటి యజమాని ఏసి కి ఏమైంది. ఏమైనా సాంకేతిక పరమైన ప్రాబ్లెమ్ ఉందేమో అని ఏసి మెకానిక్ కు పిలిపించాడు..సదరు టెక్నీషన్ వచ్చి ఏసి మెషిన్ బోర్డు ఊడదీసి చూడగా.. ఏసి లో హాయ్ గా సేద తీరుతూ ఒక త్రాచు పాము కనిపించింది. ఆ త్రాచు పాము కుబుసం కూడా ఏసి లోనే విడిచిపెట్టింది. దీని కారణంగానే కుబుసం తెల్లని పొడిగా మారి ఏసి ఆన్ చేసినప్పుడు బయటకు పడుతుంది. అంతే కాదండోయ్…అసలు ఈ పాము ఏసి లోకి ఎలా వచ్చిందా అని పరిశీలిస్తే… ఇంటి చుట్టూ పొలాలు ఉండటం వల్ల ఎలుకలను తినేందుకు వచ్చిన త్రాచు పాముకు ఏసి నుంచి బయటకు వెళ్ళే వాటర్ పైపు ప్రహరీ గోడ నుంచి బయటకు ఉండటంతో ఆ పైపు నుంచి త్రాచు పాము ఏసి లోకి ప్రవేశించింది. అలా ఆ త్రాచు పాము ఏసి మెషిన్ ను ఆవాసం గా ఏర్పరచుకుని ఉందని భావించారు. ఏసి బాగుచేసెందుకు వచ్చిన టెక్నీషియన్ ఆ పామును చంపి ఏసి క్లీన్ చేసి వెళ్ళిపోయాడు. ఈ ఘటన తో ఆ కుటుంబ సభ్యులు భయం తో వణికిపోయారు.

Read Also : TBJP: నేడే బీజేపీ మూడో జాబితా