Smita Sabharwal : భగవద్గీత శ్లోకంతో స్మితా సభర్వాల్ సంచలన ట్వీట్

‘‘కర్మణ్యే వాధికారస్తే, మాఫలేషు కదాచన’’ అంటూ తన ట్వీట్‌ను స్మితా సభర్వాల్‌‌‌(Smita Sabharwal)  మొదలుపెట్టారు.

Published By: HashtagU Telugu Desk
Smita Sabharwal Tweet Bhagavad Gita Verse Congress Govt Telangana Govt

Smita Sabharwal : తనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయడంపై ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్‌‌ స్పందించారు.  భగవద్గీత శ్లోకంతో ఎక్స్ వేదికగా ఆమె మరో సంచలన ట్వీట్ చేశారు.  ప్రస్తుతం రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న స్మితా సభర్వాల్‌‌‌ను తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ సభ్యురాలిగా బదిలీ చేశారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖను సీనియర్ అధికారి జయేశ్ రంజన్‌కు అప్పగించారు.

Also Read :Robo Police : ‘రెడ్ బటన్’ రోబో పోలీసులు వస్తున్నారహో !!

గర్వంగా, గౌరవంగా ఉంది

‘‘కర్మణ్యే వాధికారస్తే, మాఫలేషు కదాచన’’ అంటూ తన ట్వీట్‌ను స్మితా సభర్వాల్‌‌‌(Smita Sabharwal)  మొదలుపెట్టారు. ‘‘నేను పర్యాటక శాఖలో నాలుగు నెలలు పనిచేశాను. నా వంతుగా ఉత్తమంగా చేయగలిగినంత చేశాను. తెలంగాణ రాష్ట్రానికి తొలిసారిగా 2025-30 టూరిజం పాలసీని తీసుకొచ్చాను. ఇప్పటివరకు పట్టింపునకు నోచుకోని  పర్యాటక ప్రాంతాలకు ఈ పాలసీ దిశానిర్దేశం చేస్తుంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు బలమైన పునాది వేస్తుంది. పర్యాటక శాఖ పనితీరుపై అధికారులకు ఆకళింపు చేసి, బాధ్యతను నూరిపోసే ప్రయత్నం చేశాను’’ అని ఆమె వివరించారు. ‘‘ఒక గ్లోబల్ ఈవెంట్‌కు అవసరమైన ప్రణాళిక, మౌలిక వసతుల ఏర్పాటుకు పునాది వేశాను. ఇది చాలా అవకాశాలకు తలుపులు తీయగలదని నేను నమ్ముతున్నాను’’ అని స్మిత తెలిపారు. ‘‘తెలంగాణ పర్యాటక శాఖలో పనిచేసినందుకు గర్వంగా, గౌరవంగా ఉంది’’ అని ఆమె చెప్పారు. తన ట్వీట్‌లో చివరగా ఆమె నమస్కారం సింబల్‌ను జోడించారు.

Also Read :Pegasus Spyware : ఇజ్రాయెలీ ‘పెగాసస్‌’ స్పైవేర్‌ కేసు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

నెటిజన్ల నుంచి విషెస్ వెల్లువ

స్మితా సభర్వాల్‌ ట్వీట్‌కు నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. ఆమెకు విషెస్ చెబుతున్నారు. బదిలీపై వెళ్తున్న చోట కూడా మీరు బాగా పనిచేస్తారంటూ ఆశాభావం వెలిబుచ్చుతున్నారు. మీరు తెలంగాణ టూరిజంలో చాలా మార్పు తీసుకొచ్చారని పలువురు నెటిజన్లు స్మితను కొనియాడుతున్నారు. ఇటీవలే కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్మితా సభర్వాల్ సంచలన పోస్ట్ పెట్టారు. దానివల్లే ఆమెను రాష్ట్ర ప్రభుత్వం టూరిజం శాఖ నుంచి తప్పించినట్లు తెలుస్తోంది.  కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించిన ట్వీట్ చేసినందుకు స్మితా సభర్వాల్‌కు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే.

  Last Updated: 29 Apr 2025, 06:28 PM IST