Site icon HashtagU Telugu

HCU Land Issue : IAS స్మిత సభర్వాల్ తగ్గేదేలే..!

Smita Sabharwal Ias Retweet

Smita Sabharwal Ias Retweet

తెలంగాణలో కంచ గచ్చిబౌలి భూముల వివాదం (HCU Land Issue) రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతుంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఒక మార్ఫింగ్ ఫొటోను రీట్వీట్ చేసిన నేపథ్యంలో సీనియర్ IAS అధికారిణి స్మిత సభర్వాల్‌(Smita Sabharwal IAS)కు నోటీసులు (Notice) జారీ చేయడం పెద్ద చర్చనీయాంశమైంది. అయితే ఆ నోటీసులతోనే పరిమితమవకుండా, ఆమె మళ్లీ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని పోస్టులను రీట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Belt Shop : బెల్టు షాపు ఈ రేంజ్ లో కొట్టుకోవాలా తమ్ముళ్లు..?

తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలకు సంబంధించి కంచ గచ్చిబౌలి భూములపై చేసిన ఓ పోస్టును ఆమె ఎక్స్ (మాజీ ట్విట్టర్) లో రీట్వీట్ చేశారు. ఆ పోస్టులో గల సమాచారం ప్రభుత్వ చర్యలను ప్రశ్నించేలా ఉండడం గమనార్హం. అంతే కాక ఆ పోస్టులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో రూపొందించిన నెమళ్లు, బుల్డోజర్లు వంటి విజువల్స్‌ను కూడా చేర్చడం మరింత ఆసక్తికరంగా ఉంది.

ఇప్పటికే ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను వేడి పెంచగా, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న స్మిత సభర్వాల్ ఇలా సామాజిక మాధ్యమాల్లో తిరిగి స్పందించడం వలన అధికార వ్యవస్థలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ నిర్ణయాలపై ప్రశ్నలు వేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై ఆమె నుంచి ఇంకా స్పందన రాకపోయినా, ఆమె ‘తగ్గేదేలే’ అనే సంకేతం ఇచ్చినట్టుగా నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి రాబోయే రోజుల్లో మరిన్ని ట్విస్ట్‌లు వచ్చే అవకాశం కనిపిస్తోంది.