SLBC Tunnel Rescue: బుధవారం ఎస్ఎల్‌బీసీ టన్నెల్ రెస్క్యూ (SLBC Tunnel Rescue) ఆపరేషన్‌లో సహాయక చర్యలను సమీక్షించేందుకు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో సహాయక బృందాలు కొనసాగిస్తున్న పనులను విభాగాల వారీగా విశ్లేషించారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కల్నల్ పరీక్షిత్ మెహర టన్నెల్ బోరింగ్ మెషిన్ నమూనా తో అధికారులకు టన్నెల్ లోపల కొనసాగుతున్న సహాయక చర్యలను వివరించారు.
టన్నెల్ బోరింగ్ మిషన్ చివరి భాగంలోనీ శిథిలాలను తొలగించడం జరిగిందని, రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్న సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తూ శిథిలాలను తొలగిస్తూ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ గుర్తించిన సర్ఫేస్ డిస్టర్బెన్స్ ప్రాంతాలలో మట్టితీత పనులు వేగంగా జరుగుతున్నాయని, ది వాటరింగ్ ప్రక్రియ వేగంగా జరుగుతుందని, టన్నెల్ బోరింగ్ మిషన్ ఎడమవైపు నుండి వాటర్ జెట్ ల ద్వారా బురదను తొలగించే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్న సహాయక బృందాలు సమన్వయంతో నిరంతరం శ్రమిస్తున్నాయని వివరించారు.
Also Read: LG : స్మార్ట్ టివిల కోసం 100కి పైగా ఛానల్స్ ను తీసుకువచ్చిన LG ఛానల్స్
రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్న సహాయక బృందాలు తోపాటుఢిల్లీ నుండి వచ్చిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం, SLBC టన్నెల్ ప్రమాద ప్రదేశంలో రోబోటిక్ సేవల కొరకు హైదరాబాద్ కు చెందిన NV రోబోటిక్స్ ప్రతినిధుల బృందం టన్నెల్లోకి వెళ్లినట్లు తెలిపారు. టన్నెల్ బోరింగ్ మిషన్ ఎడమవైపు నుండి వాటర్ జెట్ ల ద్వారా బురదను తొలగించే పనులు ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాల ద్వారా వేగంగా జరుగుతున్నాయని వివరించారు. టన్నెల్ లో పల ఉన్న టన్నెల్ బోరింగ్ మిషన్ పై పేరుకుపోయిన మట్టిని తొలగించేందుకు వాటర్ జెట్ ల ను ఉపయోగించుకున్నట్లు వాటి పని తీరును అధికారులకు డెమో ద్వారా వివరించారు.
కన్వేయర్ బెల్టు పునరుద్ధరించామని దానికి సంబంధించిన కమీషనింగ్ పని పూర్తి చేస్తున్నట్లు, రెస్క్యూ ఆపరేషన్ లో ఎదుర్కొంటున్న ఆటంకాలను అధిగమిస్తూ సహాయక చర్యలను వేగవంతం చేసినట్లు వివరించారు. టన్నెల్ లోపల వెంటిలేషన్, లైటింగ్ సదుపాయాలను ముందుకు పొడిగించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి, టీఎస్ఎస్పీడీసీఎల్ సిఎండి ముషారఫ్ అలీ, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, కల్నల్ పరీక్షిత్ మెహ్ర, ఎన్డీఆర్ఎఫ్ అధికారి ప్రసన్న, హైడ్రా, సింగరేణి మైన్స్ రెస్క్యూ, ఎస్డీఆర్ఎఫ్ అధికారి, ఫైర్ సర్వీసెస్, దక్షిణ మధ్య రైల్వే ప్లాస్మా కట్టర్స్, ర్యాట్ మైనర్స్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లక్నో డైరెక్టర్ అయోధ్య ప్రసాద్ తప్లియాల్,, హైదరాబాదు డైరెక్టర్ శైలేంద్ర కుమార్, దక్షిణ మధ్య రైల్వే డివిజన్ మెకానికల్ ఇంజనీర్ మురళీ, తదితరులు పాల్గొన్నారు.