Site icon HashtagU Telugu

Fire Accident: సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి

Fire Accident

Resizeimagesize (1280 X 720) (2)

సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం సాయంత్రం జరిగిన భారీ అగ్నిప్రమాదం (Fire Accident)లో కనీసం ఆరుగురు మరణించారు. ప్రాణాలు కోల్పోయిన 6 మందిలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఊపిరాడక మృతి చెంది ఉండొచ్చని, అయితే విచారణ తర్వాత మృతికి గల కారణాలు తెలుస్తాయని హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తి తెలిపారు. ఆరుగురు మరణించినట్లు మాకు సమాచారం అందింది. మంటలను అదుపులోకి తెచ్చామని తెలిపారు. 12 మందిని వివిధ ఆసుపత్రుల్లో చేర్పించారని, వారిలో ఆరుగురు ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని, మిగిలిన వారు ఇంకా చికిత్స పొందుతున్నారని అధికారి తెలిపారు.

బాధితులు తెలంగాణలోని వరంగల్, ఖమ్మం జిల్లాల వాసులు. ఆ ప్రాంగణంలో కార్యాలయాన్ని కలిగి ఉన్న మార్కెటింగ్‌ కంపెనీలో వారు పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. పలు కార్యాలయాలు ఉన్న కాంప్లెక్స్‌లో రాత్రి 7.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఎనిమిది అంతస్తుల భవనంలోని ఒక అంతస్తు నుంచి భారీ మంటలు రావడంతో మంటలను ఆర్పేందుకు నాలుగు ఫైర్ టెండర్లతో సహా 10కి పైగా ఫైర్ టెండర్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్న మరో అధికారి మాట్లాడుతూ.. చాలా పొగ కమ్ముకుంటుందని, అది తగ్గడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు.

Also Read: Union Minister Injured: కేంద్రమంత్రికి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

లోపల ఎవరైనా చిక్కుకున్నారని గుర్తించేందుకు రెస్క్యూ వర్కర్లు ఇంకా ఆ ప్రాంతంలో గాలిస్తున్నారని ఆయన చెప్పారు. అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. అంతకుముందు జనవరిలో, సికింద్రాబాద్‌లోని ఐదు అంతస్తుల వాణిజ్య భవనంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. అగ్నికి ఆహుతైన భవనాన్ని తర్వాత కూల్చివేశారు.