Site icon HashtagU Telugu

CPM Leader : అత్యంత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి..!

Sitaram Yechury health condition is very serious

Sitaram Yechury health condition is very serious

CPM Leader Sitaram Yechury :  సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury ) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆయనను కుటుంబ సభ్యులు ఢిల్లీ ఎయిమ్స్‌ కు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెంటిలేటర్‌పై ఆయన చికిత్స అందిస్తున్నారు వైద్యులు. వారం రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఏచూరి ఎయిమ్స్ లో చికిత్స పొందారు. తర్వాత డిశ్చార్జీ అయ్యారు. గురువారం రాత్రి మరోసారి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఊపిరితిత్తులలో సమస్య ఉందని వైద్యులు తెలిపారు. ఎయిమ్స్‌కు చెందిన వైద్యుల బృందం ఆయనకు చికిత్స చేస్తోంది.

Read Also: Ganesh Chaturthi : ‘పుష్పరాజ్ – శ్రీవల్లి’ గా గణనాథుడు…ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు

కాగా, ఏచూరి ఆగస్టు 19న ఎయిమ్స్‌లో చేరారు. అనంతరం ఐసీయూకి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నరు. గురువారం ఆయన ఆరోగ్యం మరోసారి క్షీణించింది. న్యుమోనియా వంటి ఇన్ఫెక్షన్ చికిత్స కోసం సీతారాం ఏచూరి ఆగస్టు నెలలో చేరారు. అయితే, ఎయిమ్స్ వైద్యులు ఆయన అస్వస్థతకు సంబంధించిన వివరాలను మాత్రం అప్పుడు వెల్లడించలేదు. కొన్ని నెలల క్రితమే ఏచూరికి కంటిశుక్లం శస్త్రచికిత్స జరిగింది. అప్పటి నుంచి ఎయిమ్స్‌ వైద్యుల బృందం ఆయనకు చికిత్స చేస్తోంది.

సీతారాం ఏచూరి ఆరోగ్యంపై వస్తున్న ప్రచారాలను సీపీఎం తోసిపుచ్చింది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఉందని ధృవీకరించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం సీపీఎం కేంద్ర కమిటీ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఐసీయూ(ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లో చికిత్స పొందుతున్నారని, తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో చికిత్స పొందుతున్నారని, ప్రస్తుతం వైద్యులు అందిస్తున్న చికిత్సకు కూడా ఆయన శరీరం సానుకూలంగా స్పందిస్తోందని సీపీఎం తన ప్రకటనలో పేర్కొంది. ఆ ఆరోగ్యం మెరుగుపడుతుండటంతోనే ఎమర్జెన్సీ రూమ్ నుంచి ఐసీయూకు తరలించారని పార్టీ వెల్లడించింది.

Read Also: Backward Walking : ముందుకు కాకుండా వెనుకకు నడవడం ప్రాక్టీస్ చేయండి, చాలా ప్రయోజనాలు ఉన్నాయి.!