తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (TS Polls) కాంగ్రెస్ తో పొత్తు కుదిరితే బాగుండేదని, రాష్ట్రంలో హంగ్ వస్తే.. కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తామని అన్నారు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury). శనివారం హైదరాబాద్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కే ఎడ్జ్ ఉందంటూ చెప్పుకొచ్చారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణలో కాంగ్రెస్ (Congress) గెలుపు ఖాయమంటూ జోస్యం చెప్పారు. సీపీఎం (CPM) పోటీలో లేని చోట కాంగ్రెస్‌కే తమ మద్దతు అని ఆయన ప్రకటించారు. రాజస్థాన్‌లో మాత్రం టఫ్ ఫైట్ నడుస్తోందన్నారు. బీజేపీ ఓటమే లక్ష్యంగా సీపీఎం పనిచేస్తోందని, అందుకే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నామమాత్రంగా పోటీ చేస్తున్నట్టు చెప్పారు .
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఖమ్మం (Khammam)లో పోటీ చేయకుండా ఎన్నికల్లోకి పోవడం అంటే సీపీఎం పార్టీకి అసందర్భంగా ఉంటుందని సీపీఎంకు బలమున్న ఖమ్మం జిల్లాలో సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఒప్పుకోకపోవడం వల్లే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో నిలిచామన్నారు. కాంగ్రెస్‌తో తాము జరిపిన చర్చలు ప్రజలు అంతా గమనిస్తున్నారని కాంగ్రెస్‌తో చర్చలు అంతా పారదర్శకంగానే జరిగాయన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదిరితే బాగుండేదే అని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీకి వ్యతిరేక స్టాండ్‌తోనే ఉన్నామని, ప్రజలతో సీపీఎంకు ఉన్న సంబంధాలను నిలబెట్టుకునేందుకే తాము పోటీ చేస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ.. బీజేపీ చేతిలో బందీ అయ్యాయని ఆయన ఆరోపించారు.
Read Also : Cardamom Benefits: యాలకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!