Site icon HashtagU Telugu

Sircilla Weavers : పార్టీల జెండాల తయారీకి కేరాఫ్ అడ్రస్ ‘సిరిసిల్ల’.. విశేషాలివీ

Sircilla Weavers

Sircilla Weavers

Sircilla Weavers : ఎన్నికల టైంలో సిరిసిల్ల మాట ఎత్తగానే గుర్తుకొచ్చేది.. అక్కడ తయారయ్యే రాజకీయ పార్టీల జెండాలు. ఎన్నో జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు తమ ప్రచార జెండాలు, బ్యానర్స్, కండువాలు, టీ షర్టులను ఇక్కడే తయారు చేయిస్తుంటాయి. అసెంబ్లీ పోల్స్ నేపథ్యంలో ఇప్పటికే సిరిసిల్ల నేతన్నలకు పలు పార్టీల నుంచి ఆర్డర్స్ వచ్చాయి. మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గడ్‌, రాజస్థాన్‌ కు చెందిన రాజకీయ పార్టీల నుంచి కూడా సిరిసిల్ల నేతన్నలకు ఆర్డర్స్ వస్తుండటం గమనార్హం. ఎన్నికల సామగ్రి తయారీ వర్క్స్ ద్వారా ఎన్నికల టైంలోసిరిసిల్లలో దాదాపు 5 వేల మందికి  ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.

వైఎస్సార్ సీపీ, బీఆర్ఎస్ నుంచి..

ఇప్పటికే ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీ, తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నుంచి సిరిసిల్ల నేతలన్నలకు ఆర్డర్లు ఇచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి 5 లక్షల మీటర్ల మేర ఎన్నికల మెటీరియల్ తయారీకి ఆర్డర్ రాగా.. వైసీపీ నుంచి కూడా అంతే స్థాయిలో ఆర్డర్ వచ్చింది.  కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు కూడా ప్రచార సామాగ్రి కోసం సిరిసిల్లకే ఆర్డర్లు ఇచ్చాయని సమాచారం.

We’re now on WhatsApp. Click to Join.

సిరిసిల్లలో తయారైన పాలిస్టర్‌ బట్టను హైదరాబాద్‌ కు పంపి ఆయా పార్టీల గుర్తులతో జెండాలు, బ్యానర్లు, కండువాలుగా ప్రింటింగ్‌ చేయిస్తారు. మళ్లీ దాన్ని సిరిసిల్లకు తీసుకొచ్చి కటింగ్‌, కుట్టు పనులు చేస్తారు. జెండాలు కుట్టే పనిచేసే ఒక్కో మహిళకు నెలకు రూ.5వేల దాకా ఇస్తున్నారు. పార్టీ కండువాల లెక్కలోకి వెళితే.. ఒక్కో పార్టీ కండువా ధర రూ.5 ఉంచి రూ.50 దాకా (Sircilla Weavers) ఉంటుంది. పార్టీ చిన్న జెండా ధర రూ.10, పెద్ద బ్యానర్ ధర రూ.80 దాకా ఉంటుంది. ఇక డిజిటల్‌ బ్యానర్లలో పెద్దవాటిని రూ. 250 దాకా రేటుకు అమ్ముతున్నారు.

Also Read: MLC Kavitha: తెలంగాణ పండగలను సగర్వంగా చాటిచెబుదాం.. సంస్కృతిని కొనసాగిద్దాం