Sigachi Blast : సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి కెమికల్స్ పరిశ్రమలో ఇటీవల జరిగిన ఘోర పేలుడు ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ప్రమాదంపై మానవ హక్కుల సంఘాలు సీరియస్‌గా స్పందించాయి. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TSHRC) సుమోటోగా కేసు నమోదు చేయగా, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC) వద్దకు కూడా ప్రజల నుంచి ఫిర్యాదులు చేరాయి.
Pregnant lady : పుట్టబోయే బిడ్డ కోసం గర్బిణీలు మహిళలు తప్పక చేయించాల్సిన స్కానింగ్స్ ఏంటంటే?
ఈ ఘటనలో ప్రాణ నష్టం, తీవ్ర గాయాలు సంభవించిన నేపథ్యంలో రాష్ట్ర హెచ్‌ఆర్‌సీ విచారణ చేపట్టింది. సంగారెడ్డి కలెక్టర్, కార్మిక శాఖ కమిషనర్, అగ్నిమాపక శాఖ డీజీ, జిల్లా ఎస్పీలకు జూలై 30వ తేదీలోగా విస్తృత నివేదిక సమర్పించాలని స్పష్టంగా ఆదేశించింది. అదే సమయంలో, రామారావు అనే వ్యక్తి ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ప్రత్యేకంగా ఫిర్యాదు చేశారు. సిగాచి పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే ఈ దుర్ఘటనకు కారణమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ₹25 లక్షలు, గాయపడిన వారికి ₹10 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేగాక, రాష్ట్రంలోని అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా కోరారు.
ఇక న్యాయవాది కుమారస్వామి కూడా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ప్రమాదానికి పాత యంత్రాల వాడకమే ప్రధాన కారణమని, అధికారుల దౌర్జన్య వైఖరికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. పరిశ్రమ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలపై గట్టిగా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కేసుపై పెరుగుతున్న చర్చలు, అధికారులపై పెరుగుతున్న ఒత్తిడితో… సిగాచి పేలుడు దర్యాప్తు మరింత వేగవంతం అయ్యే అవకాశం కనిపిస్తోంది.
BJP: తెలంగాణ బీజేపీకి కొత్త నాయకత్వం.. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్. రామచందర్ రావు బాధ్యతలు