Site icon HashtagU Telugu

Fine Rice : రేషన్ సన్నబియ్యం తో సిద్దిపేట మహిళా సహపంక్తి భోజనం..రేవంత్ ఫుల్ హ్యాపీ

Siddipet Women's Fellowship

Siddipet Women's Fellowship

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) నెరవేరుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రేషన్‌కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ (Fine Rice) కూడా మొదలుపెట్టి పేదవారికి కడుపునిండా తినేలా చేసింది. ఉగాది కానుకగా సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మొదలుపెట్టారు. ప్రతీ రేషన్‌కార్డుదారునికి ఆరు కిలోల చెప్పున్న సన్న బియ్యాన్ని ఇస్తున్నారు. రేషన్ షాపుల్లో సన్నబియ్యం రావడంతో పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Ambedkar Vidya Nidhi Scheme : అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని మళ్లీ తీసుకొస్తాం – చంద్రబాబు

తాజాగా సిద్దిపేట జిల్లాకు చెందిన లక్ష్మీ అనే మహిళ కూడా సన్న బియ్యం తీసుకుని ఒక ప్రత్యేకమైన పని చేసింది. లక్ష్మీకి 24 కిలోల సన్న బియ్యం రేషన్ ద్వారా వచ్చింది. ఆమె ఈ అవకాశాన్ని ఉపయోగించి ఊరందరికీ సహపంక్తి భోజనం ఏర్పాటు చేసింది. తనకు వచ్చిన సన్న బియ్యం ద్వారా నలుగురికి భోజనం పెట్టి తన ఆనందాన్ని పంచుకుంది. ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడం తో ఆమెను అభినందించారు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆమె చేసిన పనికి ప్రత్యేకమైన ప్రశంసలు కురిపించారు. “లక్ష్మీకి నా అభినందనలు. తనకు వచ్చిన 24 కిలోల సన్న బియ్యంతో ఆమె ఊరందరికీ సహపంక్తి భోజనం పెట్టి, పేదల జీవితాల్లో ఆనందాన్ని నింపింది. ఈ పథకం ద్వారా సన్నబియ్యం లబ్ధిదారులు మా ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్లు” అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.