Site icon HashtagU Telugu

Medaram Jatara : మేడారంలో ధరల మోత..గగ్గోలు పెడుతున్న భక్తులు

Medaram Price

Medaram Price

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర (Medaram Jatara) గా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు పేరుంది. ఈ జాతర కు అనేక రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి..మొక్కులు తీర్చుకుంటారు. ఈ నెల 21 నుంచి 24 వరకూ మేడారం మహాజాతర జరగనుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గడ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ ప్రాంతాల నుంచే గాక, ఇతర రాష్ట్రాల వారూ కుటుంబ సమేతంగా వస్తున్నారు. మొదట జంపన్న వాగులో స్నానాలు చేసి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతర సమయం దగ్గర పడుతుండడం తో మేడారం పరిసరాలన్నీ కూడా అనేక షాపులతో నిండిపోయాయి.

We’re now on WhatsApp. Click to Join.

భక్తుల తాకిడి ఎక్కువ అవుతుండడం తో భక్తులకు అవసరమై వస్తువుల ధరలు అమాంతం పెంచేసి వ్యాపారస్థులు సొమ్ము (shopkeepers selling goods at high Prices) చేసుకుంటున్నారు. లీటర్‌ మంచి నీళ్ల సీసా ధరను 30 నుంచి 40 వరకు అమ్ముతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరికాయలు , బంగారం (బెల్లం) , సబ్బులు , టూత్ పేస్ట్ , షాప్స్ , టిఫిన్లు , కోళ్లు ఇలా ఏదైనా సరే డబల్ ధరలకు అమ్ముతున్నారని భక్తులు వాపోతున్నారు. మేడారం మహా జాతర ప్రారంభానికి ముందే ధరలు ఇలా ఉంటే జాతర నాలుగు రోజుల్లో మరింత పెరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో అధికారులు తక్షణమే స్పందించి ధరలు తగ్గించాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Read Also : Komatireddy : నల్గొండ జిల్లాను బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వ నాశనం చేసింది – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి