Site icon HashtagU Telugu

9 Killed: రోడ్డు టెర్రర్.. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 9 మంది దుర్మరణం

Road Accident

Road Accident

రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల కఠినంగా వ్యవహరిస్తున్నా.. ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నా ప్రమాదాలకు మాత్రం పుల్ స్టాప్ పడటం లేదు. అధిగ వేగంతో కొందరు, నిర్లక్ష్యం మరికొందరు బాధ్యత రహితంగా డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. డెత్ కేసుల్లో ఎక్కువగా రోడ్డు ప్రమాద కేసులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో  గడిచిన 24 గంటల్లో 9 మంది వేర్వేరు చోట్ల చనిపోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఆదివారం శామీర్‌పేట వద్ద బైక్‌ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. మరో ఇద్దరు ద్విచక్ర వాహనదారులు పరుగులు తీశారు. రాజేంద్రనగర్, ఆదిబట్ల వద్ద జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఆటోలు ఢీకొని ఒక్కొక్కరు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బైక్‌పై పదేళ్ల బాలుడితో సహా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. బాబాగూడ గ్రామం వద్ద వీరి బైక్ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది.

మహేశ్, కృష్ణ అక్కడికక్కడే మృతి చెందగా, వారి స్నేహితుడు మూర్తికి తీవ్ర గాయాలు కాగా, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శంషాబాద్‌లో స్కూటర్‌ను వ్యాన్‌ ఢీకొనడంతో ఎం. రఘుపతి (60) దంపతులు మృతి చెందారు. రాజేంద్రనగర్ వద్ద ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న బి. రవికాంత్ (36) బైక్‌ను వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో మృతి చెందాడు. ఆదిబట్ల వద్ద శనివారం అర్థరాత్రి వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు దాటుతున్న సెంట్రింగ్ కార్మికుడు ఎన్.గోమేష్‌ను ఢీకొట్టింది.

Also Read: Samantha Vacation: సముద్ర తీరంలో సమంత, బాలి వెకేషన్ లో బ్యాక్ అందాలతో భలే ఫోజులు!