Site icon HashtagU Telugu

BRS Flexes: బీఆర్ఎస్ కు షాక్.. ఢిల్లీలో ఫ్లెక్సీలు తొలగింపు!

Brs

Brs

ఢిల్లీ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి (CM KCR), బీఆర్ఎస్ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ కు ఢిల్లీ అధికారులు షాక్ ఇచ్చారు. బుధవారం బీఆర్‌ఎస్ పార్టీ (BRS Party) ప్రధాన కార్యాలయం పార్టీ ప్రారంభానికి ముందు న్యూఢిల్లీ వీధుల్లో భారత రాష్ట్ర సమితి నాయకులు పార్టీ ఫ్లెక్సీల (BRS Party) ను ఏర్పాటు చేశారు. అయితే నిబంధనల మేరకు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ అధికారులు తొలగించారు. ఆ ప్రాంతంలో ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి లేకపోవడంతో అధికారులు ఫ్లెక్సీలను తొలగించారు.

అంతకుముందు సోమవారం సాయంత్రం న్యూఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్‌ (CM KCR)కు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ప్రధాన పార్టీ క్యార్యాలయం దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, ఫ్లెక్సీలపై ‘దేశ్‌కీ నేత కేసీఆర్’ అని రాసి స్వాగతం పలికారు. నేడు, రేపు న్యూఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ (BRS Party) కార్యాలయ ఆవరణలో రాజ శ్యామల, నవ చండీ యాగాల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్న సంగతి తెలిసిందే. రేపు పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ (CM KCR) ప్రారంభించనున్నారు. ఢిల్లీ లో భారత రాష్ట్ర సమితి కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తరలివెళ్లారు.  బీఆర్ఎస్ (BRS) నేతలతో శంషాబాద్ విమానాశ్రయం సందడిగా కనిపించింది.

Also Read: Jigarthanda2 Teaser: యాక్ష‌న్ కామెడీ బేస్డ్‌గా ‘జిగర్‌తండా 2’.. అంచనాలు పెంచేసిన టీజర్!